సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (09:56 IST)

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. మార్షల్స్‌పై వైకాపా ఎమ్మెల్యేల దాడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పెద్ద రభస జరిగింది. 'ప్రత్యేక హోదాపై' చర్చకు పట్టుబట్టిన వైకాపా, ప్రభుత్వం అందుకు తక్షణం అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో వైకాపా సభ్యులు స్పీకర్ పో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పెద్ద రభస జరిగింది. 'ప్రత్యేక హోదాపై' చర్చకు పట్టుబట్టిన వైకాపా, ప్రభుత్వం అందుకు తక్షణం అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంలోకి దూసుకు వచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు చుట్టూ రక్షణ వలయంగా మార్షల్స్‌పై వైకాపా సభ్యులు దాడికి పాల్పడ్డారు. 
 
దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన కోడెల, "మార్షల్స్‌పై దాడి చేయవద్దు" అని పదే పదే విజ్ఞప్తి చేశారు. మీకు సభ్యత ఉంటే దయచేసి కూర్చోవాలని హితవు పలికారు. ప్రభుత్వం హోదాపై చర్చకు సిద్ధమేనని, అసెంబ్లీ ప్రశ్నోత్తరాల తర్వాత, ప్రకటన చేసిన అనంతరం చర్చిద్దామని కోడెల వెల్లడించినా వైకాపా సభ్యులు అందుకు అంగీకరించలేదు. వైకాపా సభ్యులు చాలా పొరపాటు చేస్తున్నారని, ఈ దౌర్జన్యం సరికాదని కోడెల వ్యాఖ్యానించారు.