శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 3 జులై 2019 (17:02 IST)

నారా లోకేష్ దానికి పనికిరాడు: వైసిపి కార్యకర్త సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కీలక నాయకుడుగా పని చేసిన నారా లోకేష్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సామాజిక మాధ్యమాల ద్వారా సెటైర్లు వేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నారా లోకేష్ ఉండగా అదే ట్విట్టర్ ద్వారా లోకేష్‌ను పరుష పదజాలంతో వైసీపీ కార్యకర్తలు దుర్భాషలాడుతున్నారు.
 
అమెరికాకు చెందిన ఓ ప్రవాస భారతీయుడు గత రెండు రోజుల ముందు నారా లోకేష్‌ను ఉద్దేశించి తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేశాడు. లోకేష్‌కు రాజకీయ అనుభవం లేదని దేనికీ పనికి రాని లోకేష్‌కు వివాహం చేశారంటూ దుర్భాషలాడాడు. ఈ వీడియో కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కార్యకర్త చేష్టలను తప్పుబడుతున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఉండకూడదని విమర్శ అనేది సున్నితంగా ఉండాలి తప్ప ఇష్టానుసారం చేయకూడదని ఆ వైసీపీ కార్యకర్తలు తిట్టిపోస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు నారా లోకేష్ స్పందించకపోవడం టిడిపి నేతలను ఆలోచింపజేస్తోంది. ప్రతి విషయంపై స్పందించే లోకేష్ వ్యక్తిగతంగా విమర్శ చేస్తే ఎందుకు స్పందించడం లేదని వెంటనే దీనిపై మాట్లాడాలంటూ టిడిపి నేతలు లోకేష్‌ను కోరుతున్నారు.