బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-09-2022 సోమవారం దినఫలాలు - ఆదిత్య హృదయం పఠిస్తే..

astro1
మేషం :- తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు శుభదాయకంగా ఉంటాయి. బృంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది.
 
వృషభం :- స్త్రీల మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహారించండి. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. రాజకీయనాయకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగు రంగాల్లో వారికి కలిసి వచ్చేకాలం. 
 
మిథునం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఇబ్బందులు తప్పవు. స్థిర, చరాస్తులు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ముఖ్యుల గురించి ఆందోళన పెరుగుతుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు.
 
కన్య :- కుటుంబ సమేతంగా దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి పని భారం బాగా పెరుగుతుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం.
 
తుల :- హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. దైనందిన కార్యక్రమాలలో మార్పుండదు. ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. బ్యాంకు వ్యవవహారాలు మందకొడిగా సాగుతాయి.
 
వృశ్చికం :- స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం వల్ల జయం చేకూరుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. నూతన వ్యక్తుల పరిచయం మీ అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావలసి వస్తుంది.
 
ధనస్సు :- మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
మకరం :- కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, గృహ ప్రశాంతతకు భంగం కలిగే పరిస్థితులు నెలకొంటాయి. కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన అధికమవుతుంది. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాటపడక తప్పదు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఎప్పటినుండో వాయిదా పడుతున్న సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి.
 
మీనం :- ఉద్యోగస్తులకు ఓర్పు, నేర్పుతో వ్యవహరించటం ఎంతైనా అవసరం. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.