శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-07-2023 శనివారం రాశిఫలాలు - లలిత సహస్రనామం చదివితే శుభం...

Scorpio
మేషం :- కొబ్బరి, పండ్లు, పూలు వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పాత వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు అధికమవుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
వృషభం :- స్త్రీలకు పనివారి నుంచి చికాకులు తప్పవు. రాజకీయంలో వారికి కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విహార యాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. 
 
మిథునం :- బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. పట్టుదలతో ముందడుగు వేస్తారు. రాజకీయాల్లో వారికి విరోధులు చేసే ప్రయత్నాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ పరిస్థితుల క్రమేణా మెరుగుపడతాయి. ఏదైనా అమ్మటానికై చేయుప్రయత్నాలు వాయిదా పడటంశ్రేయస్కరం.
 
కర్కాటకం :- ఫీజుల చెల్లింపులు, రసీదుల విషయంలో జాగ్రత్త అవసరం. క్రయవిక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీలు అనాలోచితంగా వ్యవహరించటం ఇబ్బందులను ఎదుర్కుంటారు. చీటికి మాటికి ఇతరులను కోపగించుకుంటారు. విదేశాలు వెళ్ళుటకు అనుకూలం. ప్రముఖులతో చర్చలు జరుపుతారు.
 
సింహం :- విద్యార్థుల మొండివైఖరి వల్ల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
కన్య :- ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందించుట వల్ల మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కార్మికులకు, ప్రైవేటు సంస్థలందు పనిచేయు క్రింది ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పరిస్థితుల క్రమేణా మెరుగుపడతాయి.
 
తుల :- వాణిజ్య ఒప్పందాలు, స్థిరాస్తిక్రయ విక్రయాలకు సంబంధించిన వ్యావహారాలు మెళకువ వహించండి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. వైద్యలకు ఒత్తిడి, ఇంజనీర్లకు సంతృప్తి కానవస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో విజయంసాధిస్తారు.
 
వృశ్చికం :- కొత్తగా చేపట్టిన వ్యాపారాలల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. దూరప్రయాణాలలో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. రచయితలకు, పత్రికా రంగాలోని వారికి చికాకులు తప్పవు. రవాణా రంగాల వారికి ఆందోళనలు అధికం.
 
ధనస్సు :- ఇతర దేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కుటుంబీకుల కోసం మంచి మంచి ప్రణాళికలు వేస్తారు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువులు దక్కించుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిదికాదని గమనించండి.
 
మకరం :- కొన్ని సమస్యలు మబ్బు వీడినట్లుగా విడిపోతాయి. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్లీడరు నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు.
 
కుంభం :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెంపుడు జంతువుల విషయంలో మెళుకువ అవసరం. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నాలు చేస్తారు.
 
మీనం :- పండ్లు, పూలు, కొబ్బరి, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రకటనలు, న్యాయ, బోధనారంగాల వారికి అనుకూలం. గృహావసరాలకు నిధులు సమకూరుతాయి.