సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-11-2022 బుధవారం దినఫలాలు - గాయిత్రి మాతను ఆరాధించిన శుభం..

Weekly astrology
మేషం :- భవిష్యత్ అవసరాలకు పొదుపు అవసరం. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పరిచయం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు పనులు హడావిడిగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి, నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
వృషభం :- రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. వ్యాపారస్తులకు అధికారుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. పనివారితో చికాకులు తప్పవు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. సందర్భానుసారంగా వ్యవహరించి ఎదుటివారిని ఆకట్టుకుంటారు. చిరకాలపు స్వప్నాలు నిజమవుతాయి.
 
మిథునం :- మీ వ్యవహారాలు సాధ్యమైనంత వరకు మీరే సమీక్షించుకోవడం మంచిది. స్త్రీలకు నరాలకు సంబంధిత చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సుల విషయంలో జాప్యం తప్పదు. దైవదీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కర్కాటకం :- రిప్రజెంటేటివ్‌లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చికాకులు తప్పవు. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. ఉద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబీకులతో పుణ్య క్షేత్రాలు, నూతన ప్రదేశాలు సందర్శిస్తారు. ఏదైనా చేయ్యాలని నిర్ణయించుకుంటే, దానికి తగిన ధనం లేదని చింతస్తూ కూర్చోవద్దు. 
 
సింహం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. స్త్రీల అభిప్రాయాలకు ఇంటా బయటామంచి స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో క్రమేణా ఆటుపోట్లు తొలగి కొంత పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధించడానికి ఎలాంటి అవకాశం వచ్చినా జారవిడుచుకోకండి. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు.
 
కన్య :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు ఆశాజనకం. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. తరుచు శుభ, దైవ కార్యాల్లో పాల్గొంటారు. తలచిన పనులు నెరవేరే అవకాశం తక్కువగా ఉంటుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులపై అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. 
 
తుల :- తలపెట్టిన పనులలో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు తప్పవు. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు ఆశాజనకం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి.
 
వృశ్చికం :- మిత్రుల ప్రోత్సాహంతో దైవ దీక్షలు స్వీకరిస్తారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్త్రీలు అస్వస్థతకు గురవుతారు. నిరుద్యోగులకు త్వరలోనే మంచి అవకాశం లభించే ఆస్కారం ఉంది. కోర్టు వ్యవహరాలు కొత్త మలుపుతిరుగుతాయి.
 
ధనస్సు :- ధనం విరివిగా వ్యయం చేసి అపోహలకు గురవుతారు. ఇతరులపై ఆధారపడక, ప్రతి వ్యవహారం మీరే సమీక్షించుకోవటం అన్ని విధాల క్షేమదాయకం. దూర ప్రయాణాల్లో చికాకులు తప్పదు. సినిమా, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులెదురైనా కొంత వెసులుబాటు ఉంటుంది.
 
మకరం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాలకు సంబంధించి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. బంధుమిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. అతిథి మర్యాదలు ఘనంగా నిర్వహిస్తారు. కుటుంబకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి.
 
కుంభం :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మితిమీరిన ఆలోచనలు మీమనస్సును వ్యాకులపరుస్తాయి. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
మీనం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. విద్యార్థులకు ధ్యేయం పట్ల అవగాహన ఏర్పడుతుంది.