సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (14:32 IST)

09-04-2023 నుంచి 15-04-2023 వరకు మీ రాశిఫలాలు

Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగేయాలి. సంప్రదింపులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆదివారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. ప్రకటనలను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు బాధ్యతల మార్పు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కష్టకాలం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు మునుముందు సత్ఫలితమిస్తాయి. వేడుకకు హాజరుకాలేరు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు నెరవేరవు. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనంతో మెలగండి. వాగ్వాదాలకు దిగవద్దు. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సోమ, మంగళవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహమార్పు అనివార్యం. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. దంతాలు, కళ్లకు సంబంధించిన సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సంప్రదింపులతో తీరిక ఉండదు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. బుధవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలుదార్లు, షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు హోదామార్పు. ఉపాధ్యాయులకు స్థానచలనం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ప్రతికూలతలు తొలగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితుల సలహా పాటించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సాంకేతిక, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఆదివారం చెల్లింపుల్లో జాగ్రత్త. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహం కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. పాత మిత్రులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. న్యాయ, వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు సామాన్యం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహనలోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. గృహమార్పు మంచి ఫలితమిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులకు కష్టసమయం. ఆధ్మాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. ఆలయాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీదైనరంగంలో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆపన్నులకు సాయం అందిస్తారు. శనివారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిశ్చితార్థాల్లో మెలకువ వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషాన్నిస్తుంది. లైసెన్సుల రెన్యువల్లో మెలకువ వహించండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఈ వారం యోగదాయకం. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆదాయం బాగుంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. అసాంఘిక కార్యక్రమాల జోలికిపోవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆర్థికలావాదేవీలతో తలమునకలవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ మాటమీద ఎదుటివారికి గురికుదురుతుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సోమవారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు పనిభారం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. రిప్రజెంటేటివ్ లు టార్గెట్లను అధిగమిస్తారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బుధవారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఓర్పు, పట్టుదలతో యత్నాలు సాగించండి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉమ్మడి వ్యాపారాలరక అనుకూలం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.