మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (22:28 IST)

ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు హ్యాట్రిక్ ఓటమి..

Rajastha Royals
Rajastha Royals
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్-16 ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది.
 
ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ దూకుడైన ఆరంభం అందించాడు. ఆఖర్లో షిమ్రోన్ హెట్మెయర్ సిక్సర్ల మోత మోగించిన వేళ... రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. 
 
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు నమోదు చేసింది. రాజస్థాన్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసింది.