1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (20:42 IST)

ఆయుర్వేద చిట్కాలతో సౌందర్యం

వేసవిలో చర్మ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎండలకు చర్మం కమిలిపోయి అందాన్ని కోల్పోతుంది. కనుక ఇంటి చిట్కాలతో శరీర సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. బోరాక్స్ తెలుగులో టంకణము అంటారు, దీన్ని పసుపును సమంగా తీసుకుని కొబ్బరినూనెలో కలిపి కాళ్ల పగుళ్లు, పెదాల పగుళ్లు వద్ద పట్టిస్తే అవి తగ్గిపోతాయి. గారచెట్టు పండులోని మెత్తటి గుజ్జును ముఖానికి పలుచగా లేపనం చేస్తుంటే క్రమంగా ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
 
శ్రీగంధము, అగరు, ఒట్టివేరు సమానంగా కలిపి చూర్ణం చేసి దాన్ని పాలు లేక పన్నీరుతో కలిపి ముఖంపై మర్దిస్తుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది. కుంకుమ పువ్వు, చందనము, కస్తూరి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. పచ్చి పసుపు, మానిపసుపు, మంజిష్ట, ఆవాలు మేకపాలలో కలిపి మెత్తగా నూరి చర్మంపై పట్టిస్తే మృదువుగా మారుతుంది.
 
సీతాఫలం గింజలను వేపనూనెలో మర్దించి తలకు రాస్తుంటే చుండ్రు తగ్గుతుంది. గసగసాలు పాలలో మర్దించి తలకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.