సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (16:39 IST)

గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం.. ఆపిల్ మాస్క్.. నీటిని ఎక్కువగా తీసుకుంటే..?

Lips
Lips
చాలామంది గులాబీ రేకుల్లాంటి పెదాలను పొందడానికి మార్కెట్‌లో లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అందమైన,మృదువైన పెదవుల కోసం సహజమైన రీతిలో ఏ చిట్కాలను పాటించాలో చూద్దాం.. 
 
1. నీరు ఎక్కువగా తాగండి: 
సీజన్‌లో మార్పులు పెదాల రంగును కూడా మారుస్తాయి. ముఖ్యంగా ఎండా కాలంలో పెదాలు నల్లగా మారే అవకాశం ఉంది. కాబట్టి శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ఎక్కువగా నీటిని తీసుకోవాలి.
 
2. పెదవులకు బెస్ట్ మాయిశ్చరైజర్: ముఖం-చర్మానికి మాయిశ్చరైజర్ ఎంత అవసరమో పెదాలకు కూడా మాయిశ్చరైజర్ అవసరమని చర్మ నిపుణులు అంటున్నారు. బాదం నూనె సీరమ్ లేదా కొబ్బరి నూనె సీరమ్‌తో మాయిశ్చరైజింగ్ చేయడం వల్ల పెదాలు గులాబీ రంగును సులభంగా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
3. పెదవులకు మాస్క్ వేయండి: ఈ రోజుల్లో చాలా మంది ముఖం- జుట్టు సంరక్షణ కోసం మాస్క్‌లు వేసుకుంటున్నారు. మంచి పెదాలకు కూడా లిప్ మాస్క్ ఉపయోగపడుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. 
 
దీని కోసం, ఒక చెంచా తేనె తీసుకుని, అందులో కొబ్బరి నూనె చుక్కలు వేయండి. అందులో చిటికెడు పసుపు వేయాలి. వీటి మిశ్రమాన్ని తయారు చేసి పెదవులపై రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.