గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (15:29 IST)

స్ట్రాబెర్రీతో ఫేస్ ప్యాక్.. మొటిమలు, మచ్చలను నివారించడానికి..?

స్ట్రాబెర్రీలు అన్ని చర్మ రకాలకు అపరిమితమైన ప్రయోజనాలను అందిస్తాయి. చర్మ రంధ్రాలలో ఉన్న మురికిని బయటకు పంపి, ముఖాన్ని శుభ్రపరచడానికి బాగా పనిచేస్తుంది. ఈ పండ్లు చాలా రుచిగా, సువాసనగా ఉంటాయి. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఈ పండ్ల సువాసన, నాణ్యతను సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు. 
 
యుక్తవయస్సులో ఉన్న బాలికలు మొటిమలు, మచ్చలను నివారించడానికి ఈ పండ్లను తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఈ పండ్లలో చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణం ఉంది. కాబట్టి ముఖంపై ఉండే మొటిమల మచ్చలను త్వరగా పోగొట్టే గుణం దీనికి ఉంది.
 
సన్ బర్న్- సన్ డ్యామేజ్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. స్ట్రాబెర్రీలో ఉండే సాలిసిలిక్ యాసిడ్ మొటిమలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ముఖంపై మృతకణాలు పేరుకుపోతే ముఖంలోని మెరుపు తగ్గుతుంది. ఇది మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది.
 
స్ట్రాబెర్రీలు, పెరుగు, తేనెను సమంగా తీసుకుని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేస్తే మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. వారానికోసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు త్వరగా తగ్గుతాయి.