గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (18:25 IST)

రవిబాబు, పూర్ణ, ఈటీవీ విన్ ప్రజంట్స్ అసలు చిత్రం

Asalu-purna
Asalu-purna
వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ రవిబాబు థ్రిల్లర్స్ ని రూపొందించడంలో దిట్ట. ఇపుడు ఆయన నుంచి మరో ఎక్సయిటింగ్ మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. ఈటీవీ విన్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రవిబాబు కీలక పాత్రలో నటిస్తూ నిర్మించిన సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్ 'అసలు'. పూర్ణ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించగా రవిబాబు స్వయంగా కథ అందించారు.
 
తాజాగా 'అసలు' ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంతం క్యురియాసిటీని పెంచింది. ప్రొఫెసర్ చక్రవర్తిని ఎవరో దారుణంగా హత్య చేయడం, ఆ మర్డర్ మిస్టరీ ని ఛేదించడానికి పవర్ ఫుల్ కాప్ గా రవిబాబు రంగంలోకి దిగడం, ఈ కేసులో నలుగురు అనుమానితులు, నాలుగు రహస్యాలు, ఒక ఆశ్చర్యకరమైన నిజం, చివరికి  హంతకుడు ఎవరు?.. ఇలా ఆసక్తికరమైన ప్రశ్నలు రేకెత్తిస్తూ ట్రైలర్ గ్రిప్పింగా సాగింది.
 
స్ట్రాంగ్  మైండెడ్ కాప్ గా రవిబాబు ఇంటెన్స్ రోల్ లో కనిపించారు. పూర్ణతో పాటు మిగతా పాత్రలన్నీ ఈ మిస్టరీ థ్రిల్లర్ లో కీలకంగా వుండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ఉదయ్, సురేష్ ల టేకింగ్ ఎక్స్ టార్డినరీగా వుంది. ఎస్ఎస్ రాజేష్ అందించిన నేపధ్య సంగీతం, చరణ్ మాధవనేని కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. రవిబాబు మరో యూనిక్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ని చూపించబోతున్నారని ట్రైలర్ భరోసా ఇస్తోంది.
నటీనటులు: రవిబాబు, పూర్ణ, సూర్య కుమార్, భగవాన్ దాస్, సత్య కృష్ణన్