సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (10:33 IST)

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ..

Poorna
Poorna
సినీ నటి పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. పూర్ణ తల్లి అయిందనే వార్తతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
పూర్ణ ఇటీవల దుబాయ్ వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూర్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సీమంతం ఫొటోలు వైరల్ అయ్యాయి. 
 
దుబాయ్ ఆసుపత్రిలో మంగళవారం పూర్ణ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. 
 
పూర్ణ తన భర్తతో కలిసి బిడ్డను పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. పూర్ణ ఇటీవల "దసరా" చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో ఆమె విలన్ భార్యగా నటించింది.