1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2017 (16:31 IST)

దాంపత్య జీవితానికి మేలుచేసే కలబంద

కలబందలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కలబందను వేళ్లు కూడా దాంపత్య జీవితానికి మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదెలాగంటే..? కలబందలో కొన్ని రకాలున్నాయి. కలబందను కాస్మెటిక్స్‌లో విరివిగా ఉప

కలబందలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కలబందను వేళ్లు కూడా దాంపత్య జీవితానికి మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదెలాగంటే..? కలబందలో కొన్ని రకాలున్నాయి. కలబందను కాస్మెటిక్స్‌లో విరివిగా ఉపయోగిస్తున్నారు. అలాంటి కలబంద వేర్లను ముక్కలు ముక్కలు చేసి శుభ్రపరిచి ఇడ్లీలు ఉడికించే పాత్రలో ఉంచి.. పాలు పోసి ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికాక.. బాగా ఎండబెట్టి పౌడర్‌లా చేసుకోవాలి. ఈ పొడిని రోజూ ఒక టీ స్పూన్ మేర పాలలో కలుపుకుని తాగితే.. దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
అలాగే ఉదయాన్నే పరగడుపున కలబంద గుజ్జును తింటే, ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ళనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.