శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (17:51 IST)

కలబంద రసంలో కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే?

కలబంద రసంలో అర స్పూన్‌ ముల్తానీ మట్టి , అర స్పూన్‌ చందనపు పొడి కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై ఫ్యాక్‌లా వేస్తే మొటిమలు మటు మాయమవుతాయి.

కలబంద అందానికే కాదు.. ఆరోగ్యానికి కలబంద ఉపయోగపడుతుంది. ఇది సన్‌స్క్రీన్‌ గానూ పనిచేస్తూ, స్కిన్‌ ఎలర్జీలను కూడా దూరం చేస్తుంది. కలబంద రసాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం ప్రకాశ వంతంగా మారుతుంది. ఇంకా కాలిన గాయాలపై కలబంద రసాన్ని పూతలా పూస్తే గాయాలు మటుమాయం అవుతాయని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
* కలబంద రసంలో కాస్తా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న చోట పూస్తే నలుపు పోతుంది.
 
* ఉదయం పరగడుపున కల బందను సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి
 
* రోజ్‌ వాటర్‌, కలబంద రసం సమానంగా తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారిన చర్మంపై పూస్తే చర్మం కళకళ లాడుతుంది.
 
* కలబంద రసంలో అర స్పూన్‌ ముల్తానీ మట్టి , అర స్పూన్‌ చందనపు పొడి కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై ఫ్యాక్‌లా వేస్తే మొటిమలు మటు మాయమవుతాయి.