1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. beauty care tips

పెదాలు పొడిబారకుండా ఉండాలంటే... బ్లాటింగ్ కాగితాన్ని...

చాలామందికి పెదాలు పొడిబారడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఈ సమస్యకు ముఖ్యంగా శరీరానికి సరిపడా నీటిని తీసుకోవాలి. అయినా పొడిబారితే లిప

lips
చాలామందికి పెదాలు పొడిబారడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఈ సమస్యకు ముఖ్యంగా శరీరానికి సరిపడా నీటిని తీసుకోవాలి. అయినా పొడిబారితే లిప్‌స్టిక్ వేసుకునే ముందు పెట్రోలియం జెల్లీ లేదా లిప్‌బామ్ రాసుకోవాలి. ముఖంపైనే కాదు, పెదవులపై మృతకణాలు తొలగించకపోయినా కూడా అవి తేమగా ఉండవు.
 
పళ్లు తోముకునేముందుగా బ్రష్‌తో పెదాలపై సున్నితంగా రుద్దితే చక్కని ఫలితాలను పొందవచ్చును. ఒకసారి లిప్‌స్టిక్ వేసుకుంటే మరోసారి అవసరం లేదు. కానీ గోళ్లరంగు తరహాలో లిప్‌స్టిక్‌ని కూడా రెండుసార్లు వేసుకుంటే పెదాలు పొడిబారడం జరుగుతుంది. ఒకవేళ లిప్ట్‌స్టిక్ ఎక్కువగా వేసుకున్నట్లైతే బ్లాటింగ్ కాగితాన్ని పెదాలపై అద్దుకుంటే మంచిది. రంగు ఎక్కువగా ఉన్నా కూడా ఆ బ్లాటింగ్ కాగితానికి అంటుకుంటుంది.  
About Writer
Kowsalya