Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు, పసుపు, బీట్‌రూట్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

బీట్‌రూట్‌లో సౌందర్యానికి వన్నె తెచ్చే ఎన్నో గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్ గుజ్జులో నాలుగు చుక్కల బాదం నూనె, చెంచా ఆలివ్‌ నూనె వేసి ముఖానికి మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుం

Written By Selvi
Updated: బుధవారం, 1 మార్చి 2017 (11:49 IST)
బీట్‌రూట్‌లో సౌందర్యానికి వన్నె తెచ్చే ఎన్నో గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్ గుజ్జులో నాలుగు చుక్కల బాదం నూనె, చెంచా ఆలివ్‌ నూనె వేసి ముఖానికి మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే అరకప్పు పెరుగులో చిటికెడు పసుపూ, కొద్దిగా బీట్‌రూట్‌ గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక శుభ్రం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. చర్మం కాంతిమంతమవుతుంది. 
 
బీట్‌రూట్‌ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలూ దూరమవుతాయి. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 
 
బీట్‌రూట్‌ రసం, కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మకణాలను శుభ్రం చేస్తుంది. అదే బీట్‌రూట్‌ రసంలో నిమ్మరసం కలిపి రాసుకుంటే పిగ్మెంటేషన్‌ సమస్య దూరమవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.

అన్నీ చూడండి

పాఠశాలలు తనిఖీ చేసేందుకు ఈ బొద్దింక జనతా పార్టీకి ఎలాంటి అధికారం వుంది? నెటిజన్స్ ఫైర్

సరుకులు ఆలస్యంగా తెచ్చాడని బ్లింకిట్ డెలివరీ బోయ్‌ను ఇంట్లోకి లాక్కెళ్లి చితక్కొట్టిన దంపతులు, వీడియో

ప్రేమించి పెళ్లి చేసుకున్నది, భర్తపై అనుమానంతో అతడి పీక కోసి తల వద్ద దీపం పెట్టింది

Pawan Kalyan, తీవ్రమైన జ్వరం, మళ్లీ భుజం నొప్పి వచ్చిందా, హుటాహుటిన హైదరాబాద్‌కి పవన్

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక బలమైన సందేశం: చందన మారిపల్లి

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకో మగడా అంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments