రోజూ 20 గ్రాముల టమోటా తీసుకోండి.. అందంగా కనబడండి..!
టమోటా ఆరోగ్యానికే కాదు.. శరీరానికీ ఎంతో మేలు చేస్తుంది. టమోటాలో శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్లు వుండటంతో పాటు లైకోపీన్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి సూర్యకాంతి ద్వారా హాని కలిగించే కిరణాల నుంచి చర్మాన్ని స
టమోటా ఆరోగ్యానికే కాదు.. శరీరానికీ ఎంతో మేలు చేస్తుంది. టమోటాలో శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్లు వుండటంతో పాటు లైకోపీన్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి సూర్యకాంతి ద్వారా హాని కలిగించే కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తాయి. సూర్యకాంతి వలన చర్మం పైన వచ్చే ముడతలను తొలగిస్తాయి. కావున రోజు మీరు తీసుకునే ఆహారంలో 20 గ్రాముల టమోటాలను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే సన్ ఫ్లవర్ ఆయిల్‌ను తీసుకుంటే చర్మసౌందర్యం పెంపొందుతుంది. పొద్దు తిరుగుడు పువ్వుల నుంచి వచ్చే నూనెల ద్వారా కాస్మెటిక్స్ తయారు చేస్తారు. సన్ ఫ్లవర్ ఆయిల్‌లో ఒమేగా-6 అనే ఫాటీ ఆసిడ్‌లు ఉంటాయి. సన్ ఫ్లవర్ పౌడర్ ద్వారా చర్మం, మొటిమలు, ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు రాకుండా సహాయపడుతుంది.
సన్ ఫ్లవర్ తరహాలోనే పాలకూర కూడా చర్మానికి అందాన్నిస్తుంది. పాలకూరలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ-ఆక్సిడెంట్‌లు వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. మొటిమలను దూరం చేస్తుంది. పాలకూరలో ఎక్కువగా విటమిన్ ఏసీఈకేలు ఉంటాయి.
ఇక కోకో పౌడర్లోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కోకో పొడిని రోజు వాడటం వలన మీ చర్మాన్ని మృదువుగా తయారవుతుంది. చర్మానికి తేమనిస్తుంది. కోకో పౌడర్‌ని వాడటం ద్వారా రక్తప్రసరణ పెంచి, చర్మానికి ఆక్సిజన్ ఎక్కువగా అందించి సన్ టాన్ నుంచి రక్షిస్తుంది.