గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (14:25 IST)

ముఖంపై మచ్చలు పోవాలంటే..? వారానికి ఓసారైనా ఆవిరిపట్టండి

ముఖంపై గల మచ్చలు తొలగిపోవాలంటే వారానికి రెండు సార్లు ముఖానికి ఆవిరి పట్టాలి. వస్తున్నది వేసవి కాలం కావడంతో ఎండలో తిరగడం ద్వారా చర్మం కమిలిపోతుంది. అలాంటప్పుడు చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకే ఏదైనా

ముఖంపై గల మచ్చలు తొలగిపోవాలంటే వారానికి రెండు సార్లు ముఖానికి ఆవిరి పట్టాలి. వస్తున్నది వేసవి కాలం కావడంతో ఎండలో తిరగడం ద్వారా చర్మం కమిలిపోతుంది. అలాంటప్పుడు చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకే ఏదైనా క్రీమ్‌ను ముఖానికి రాసుకుని మృదువుగా మర్దన చేసుకుని ఆవిరిపడితే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. చర్మానికి తేమనిస్తుంది. 
 
శరీరంలోని వ్యర్థాలను తొలగించుకోవాలంటే.. ఆవిరి స్నానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుబాటులో లేనప్పుడు కనీసం ముఖానికైనా ఆవిరి పడితే మేలు. అయితే నీరు మరీ వేడిగా మసలుతున్నప్పుడు ఎక్కువ సమయం ఆవిరి పట్టకూడదు. అలా చేస్తే చర్మం ఎర్రగా కందిపోతోంది. ముఖం మీద విపరీతంగా మొటిమలున్నవారు ఆవిరికి దూరంగా ఉండటం మంచిది. ఆవిరి పట్టడం ద్వారా ముఖ చర్మంలో రక్తకణాలు ఉత్తేజితమవుతాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మ కణజాలానికి సరిపడా ప్రాణవాయువు అందుతుంది.