శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (12:21 IST)

పాదాలు అందంగా మారాలంటే.. అరటిపండుతో ఇలా చేయండి..

పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే..? అరటిపండును ముద్దగా చేసి పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్లపై రాసి పదినిమిషాలు ఉంచి, తర్వాత నీటితో శుభ్రపర్చుకుంటే మడమలు మెత్తబ

పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే..? అరటిపండును ముద్దగా చేసి పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్లపై రాసి పదినిమిషాలు ఉంచి, తర్వాత నీటితో శుభ్రపర్చుకుంటే మడమలు మెత్తబడతాయి. ఆపై గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి అందులో పాదాలను ఉంచాలి. పది నిమిషాల తరువా మామూలు నీటితో శుభ్రపరుచుకుంటే పగుళ్ల వల్ల ఉండే నొప్పి తగ్గుతుంది. ప్రతిరోజూ సాయంత్రం రోజ్‌వాటర్‌ను కాళ్ల పగుళ్లపై రాసి మృదువుగా మర్దనా చేసినా ఫలితం ఉంటుంది.
 
అలాగే నిమ్మరసం, వ్యాజ్‌లైన్‌ వేసిన గోరువెచ్చని సబ్బు ద్రావణంలో పాదాలను పెట్టి.. తర్వాత పొడి వస్త్రంతో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్‌ రాయాలి. ఉదయం ఆవనూనెతో కాళ్లను మర్దనా చేసుకుంటే పగుళ్లు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయని.. వీటితో పాటు పోషకాహారం తీసుకోవడం ద్వారా పాదాల పగుళ్లను నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.