Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బొప్పాయి గుజ్జుతో చిట్లిన జుట్టుకు చెక్

జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అయితే బొప్పాయి ప్యాక్ ట్రై చేయండి. అరకప్పు బొప్పాయి గుజ్జులో పావుకప్పు పెరుగు కలిపి తలకు పట్టించాలి. కురులకు సైతం పట్టించి.. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

Written By Selvi
Updated: శనివారం, 17 జూన్ 2017 (17:02 IST)
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అయితే బొప్పాయి ప్యాక్ ట్రై చేయండి. అరకప్పు బొప్పాయి గుజ్జులో పావుకప్పు పెరుగు కలిపి తలకు పట్టించాలి. కురులకు సైతం పట్టించి.. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుమూడుసార్లు చేస్తే జుట్టు మృదువుగా తయారవుతాయి. చివర్లలో చిట్లిపోవడం కూడా తగ్గిపోతుంది. 
 
కోడిగుడ్డు పచ్చసొనలో పావుకప్పు ఆముదం, చెంచా తేనెను చేర్చి బాగా కలుపుకోవాలి. దీన్ని మాడుకు జుట్టుకు రాసుకువి అరగంట తర్వాత కడిగేస్తే పొడిబారిన జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. జుట్టు రాలుతుంటే.. బంగళాదుంపను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బంగాళా దుంప రసంలో రెండు పెద్ద చెంచాల కలబంద గుజ్జు, తేనె కలిపి తలకు రాసుకుని మర్దన చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. 
 
మెంతులు చుండ్రునే కాదు.. జుట్టు రాలే సమస్యను కూడా నివారిస్తాయి. మెంతుల్ని ఓ రాత్రంతా నానబెట్టి మర్నాడు ముద్దలా చేసుకోవాలి. అందులో పావుకప్పు పెరుగు కలిపి తలకు రాసుకుని ఇరవై నిమిషాలయ్యాక కడిగేయాలి.
 
జుట్టు కుదుళ్లు బలంగా మారాలంటే.. తలకు అరటిపండు పూత వేయాలి. బాగా పండిన అరటిపండు ఒకటి తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులో చెంచా చొప్పున కొబ్బరి, ఆలివ్‌నూనె కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.

అన్నీ చూడండి

Big 24 Hours: భారత రాజకీయాల్లో రాబోయే 24 గంటలు..

బిగ్ బాస్ విన్నర్ నన్ను ప్రేమించి మోసం చేసాడు: యువతి ఆత్మహత్య యత్నం

సీజేపీ నిరసనల ఎఫెక్ట్‌.. ఢిల్లీలో మూతబడిన మెట్రో స్టేషన్లు.. పోలీసులకు లైంగిక వేధింపులు

Wanaparthy: చికెన్ కూర తిన్న తర్వాత 22 మంది విద్యార్థినులకు అస్వస్థత

ఇకపై ఏఐను ఎస్ఐగా పిలవాల్సిందే : డోనాల్డ్ ట్రంప్ హుకుం

అన్నీ చూడండి

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

చిన్నప్పటి నుంచి ఆ హీరో అంటే నాకు క్రష్ : నటి ఆనంది

Mayooka Review :శ్రీ తేజ్ ఎస్ కే. తన మయూఖ చిత్రంతో ఆకట్టుకున్నాడా!.మయూఖ రివ్యూ

తర్వాతి కథనం
Show comments