1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (11:45 IST)

బంగాళదుంపతో చర్మానికి ఎంతో మేలు.. ట్యాన్ తొలగిపోవాలంటే?

నిమ్మ, గులాబీ, దోస ఇవి మీ చర్మంపై ట్యాన్‌ను చాలా చక్కగా తొలగిస్తాయి. ఈ మూడింటినీ సమ పాళ్ళల్లో ఒక బౌల్‌లో కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవాలి. మీ ముఖానికే కాక మెడ వరకూ పట్టించుకోవాల

నిమ్మ, గులాబీ, దోస ఇవి మీ చర్మంపై ట్యాన్‌ను చాలా చక్కగా తొలగిస్తాయి. ఈ మూడింటినీ సమ పాళ్ళల్లో ఒక బౌల్‌లో కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవాలి. మీ ముఖానికే కాక మెడ వరకూ పట్టించుకోవాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం సన్ ట్యాన్‌ను తొలగిస్తుంది. ఇక రోజ్ వాటర్, దోస చర్మం మృదువుగా మారేలా చేస్తాయి
 
అలాగే బంగాళాదుంప చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముక్కలుగా కోసుకుని ముఖంపై రాసుకోవటం వల్ల ట్యాన్ అయిన చోట మళ్ళి చర్మం సరి అవుతుంది. కొద్ది నిమిషాలు ఉండి తర్వాత వాష్ చేసుకోండి. బంగాళాదుంప జ్యూస్‌ని కూడా రాసుకోవచ్చు. ఈ రసానికి నిమ్మరసం కాస్త కలుపుకుని రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.