వర్షాకాలంలో జిడ్డు వదిలించుకోవాలంటే..?

వర్షాకాలంలో ముఖంపైనే కాకుండా.. కేశాలకు పట్టిన జిడ్డు వదిలించుకోవాలంటే.. నిమ్మరసాన్ని ఉపయోగించాల్సిందే అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. వర్షంలో తడవడంతో జుట్టు జిడ్డుగా మారితే.. తలస్నానం చేసినా జుట్టు జి

శుక్రవారం, 13 జులై 2018 (12:43 IST)
వర్షాకాలంలో ముఖంపైనే కాకుండా.. కేశాలకు పట్టిన జిడ్డు వదిలించుకోవాలంటే.. నిమ్మరసాన్ని ఉపయోగించాల్సిందే అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. వర్షంలో తడవడంతో జుట్టు జిడ్డుగా మారితే.. తలస్నానం చేసినా జుట్టు జిడ్డుగా వుంటే.. రెండు కోడిగుడ్ల పచ్చసొనలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాయాలి. బాగా ఆరాక తలస్నానం చేయాలి. జిడ్డు వదలడమే కాదు, కేశాలు కూడా మెరిసిపోతాయి. 
 
అలాగే ఆలివ్‌నూనె, తేనెను తీసుకుని కాస్త గోరువెచ్చగా చేసి తలమాడుకు జుట్టుకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఇంకా ముఖానికి ఆలివ్ నూనె, తేనె మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకుంటే ముఖంపైనున్న జుడ్డు తొలగిపోతుంది.
 
జుట్టు చివర్ల చిట్లిన సమస్య వుంటే.. అరకప్పు పెరుగులో పావుకప్పు బొప్పాయి గుజ్జు కలిపి తలంతా పూతలా పట్టించాలి. అరగంటాగి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. అదేవిధంగా కలబంద గుజ్జులో పెద్ద చెంచాడు నిమ్మరసం, రెండు పెద్ద చెంచాల ఆముదం కలిపి తలంతా రాసి బాగా మర్దనా చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చివర్లు చిట్లడటం తగ్గుతుంది. ఇదే మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా చర్మ సౌందర్యం మెరుగవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

APSRTC: ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. 60 ప్రయాణికులకు ఏమైంది?

గుంటూరులో నీటి వివాదం: మహిళపై దాడి, వివస్త్రను చేసి వేధింపులు

గోదావరి డెల్టా 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాత లోటు

డిజిటల్ ఆధారాలతో అలా పట్టుకున్నారు... భర్తను ప్రియుడితో కలిపి చంపేసింది..

25 సార్లు సిట్-అప్స్ స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థి.. పీటీ టీచర్‌కు మెమోలు

అన్నీ చూడండి

Sumanth: వారాహి అమ్మవారి చుట్టూ సాగే కథతో మహేంద్రగిరి వారాహి సిద్ధం

Ameer Log: అమీర్ లోగ్ నుంచి స్ట్రీట్ ఆంథమ్‌లా సాగే సీదా హెలికాప్టర్ షాట్ పాట

దురంధర్, ది రాజా సాబ్ సినిమాలతో ఓటీటీలో పోటీలో నెగ్గిన శ్రీ నందు అగ్లీ స్టోరీ

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

Dixith Shetty :దీక్షిత్ శెట్టి, శశి ఓదెల చిత్రానికి #KJQ (కింగ్ జాకీ క్వీన్) పేరు ఖరారు

తర్వాతి కథనం
Show comments