శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2016 (11:12 IST)

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి పండ్లు జిడ్డు చర్మాన్ని తొలగించడానికి ఎంతో ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీలు గుజ్జుగా చేసి, కొంచెం నిమ్మరసంలో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగి

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి పండ్లు జిడ్డు చర్మాన్ని తొలగించడానికి ఎంతో ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీలు గుజ్జుగా చేసి, కొంచెం నిమ్మరసంలో కలిపి ముఖానికి  పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితాల్ని పొందవచ్చు. ఇవి మన చర్మాన్ని ముడతలు రాకుండా కాపాడటంలో ఎంతో ఉపయోగపడుతుంది.
 
బాగా పండిన అరటిపండ్లు మీ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి. పండిన అరటి పండును గుజ్జుగా చేసి ఒక టేబుల్ స్పూన్ జోడించి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అది గట్టిపడేవరకు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు లేని చర్మాన్ని పొందవచ్చు. ఇంకా మెరుగైన ఫలితాల కోసం నారింజ రసాన్ని పట్టిస్తే జిడ్డు లేని చర్మాన్ని పొందవచ్చు.