Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుపుగా మారిన పెదవులను రోజా రేకుల్లా మార్చాలంటే?

పెదవులకు లిప్ బామ్స్‌ వాడుతున్నారా? లిప్ స్టిక్కులు వాడుతున్నారా? వాటిని ఇక ఆపేయండి. ఎందుకంటే వాటిలోని రసాయనాలు పెదవులను నలుపుగా మార్చేస్తాయి. అందుకే పెదవులు నల్లబారకుండా వుండాలంటే.. నలుపు తిరిగిన పెద

Written By selvi
Updated: శనివారం, 17 మార్చి 2018 (18:50 IST)
పెదవులకు లిప్ బామ్స్‌ వాడుతున్నారా? లిప్ స్టిక్కులు వాడుతున్నారా? వాటిని ఇక ఆపేయండి. ఎందుకంటే వాటిలోని రసాయనాలు పెదవులను నలుపుగా మార్చేస్తాయి. అందుకే పెదవులు నల్లబారకుండా వుండాలంటే.. నలుపు తిరిగిన పెదవులు రోజా రేకుల్లా తయారవ్వాలంటే.. ఈ చిట్కాలు పాటించండి. అలొవెరా గుజ్జును రోజూ రాసుకుంటే చాలు. ఇందులోని పాలీఫినాలిక్‌ ఆమ్లాలు పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. అందులోని పోషకాల కారణంగా పెదాలు మృదువుగా మారుతాయి. 
 
అలాగే టేబుల్‌స్పూను నిమ్మరసంలో టేబుల్‌స్పూను తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించి ఓ గంటసేపు ఉంచాలి. తరవాత మెత్తని తడిబట్టతో తుడిచేయాలి. ఇలా రోజుకి కనీసం మూడుసార్లు చేయాలి. నిమ్మరసం వల్ల పెదవుల నలుపు రంగు పోతుంది. తేనె వల్ల పెదవులు మృదువుగా తయారవుతాయి. 
 
అలాకాకుంటే కాటన్ బడ్‌తో గ్లిజరిన్‌ను పెదవులకు రాసి నిద్రించాలి. ఇలా చేస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి. నల్లబడిన పెదాలకు ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. టీస్పూను వినెగర్‌లో టీస్పూను నూనె కలిపి దాన్ని దూది సాయంతో పెదాలకు పట్టించి, పది నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే మంచిదని.. తద్వారా పెదవులు రోజా రేకుల్లా తయారవుతాయని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

కొందరు కుర్రాళ్లు జర్మనీ, జపాన్ వెళ్తే ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయ్: మంత్రి వివేక్, వీడియో

నింగిలో భారీ కుదుపులకు లోనైన విమానం - ప్రయాణికులకు గాయాలు

Trisha: ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. త్రిష త్రిష అని వారు నినాదాలు చేస్తే.. నా తప్పేంటి?

ఏంటయ్యా నీ భాష.. ఆడదాన్ని అవమానిస్తావా..? త్రిషకు క్షమాపణ చెప్పు.. ఖుష్భూ డిమాండ్

Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. వీధులన్నీ జలమయం.. భారీ వర్షపాతం (video)

అన్నీ చూడండి

Merlapaka Gandhi :కొన్నిసార్లు ఆ కథ నాకే నచ్చదు, గేప్ కు కారణం అదే : మేర్లపాక గాంధీ

గాయం రూపంలో దేవుడు బలవంతంగా సెలవు ఇచ్చాడు : రష్మిక మందన్నా

Tej: ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కావాలనే కోరిక ఉంది : దందా డైరెక్ట‌ర్ ఆదిత్య దేవులపల్లి

Sid Sriram: ది రెడ్ బ్యాగ్ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన మెలోడీ సాంగ్

డీప్‌ఫేక్ ఫోటోలు తక్షణం తొలగించండి.. లేదా చట్టపరమైన చర్యలు : మృణాల్ ఠాకూర్

తర్వాతి కథనం
Show comments