మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (13:04 IST)

సదర్ బజార్‌లో దీపావళి సేల్.. మేక్ ఇన్ ఇండియా ప్రాడక్టులదే హవా.. చైనా బ్రాండ్స్‌పై నిషేధం..!

భారత్-పాకిస్థాన్‌ల మధ్య సర్జికల్ స్ట్రైక్స్‌కు అనంతరం మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్‌కు అనంతరం పాక్‌కు చైనా వంతపాడిన ప్రభావమో లేకుంటే ప్రధాన మంత్రి మోడీ పిలుపు మహాత్యమో..

భారత్-పాకిస్థాన్‌ల మధ్య సర్జికల్ స్ట్రైక్స్‌కు అనంతరం మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్‌కు అనంతరం పాక్‌కు చైనా వంతపాడిన ప్రభావమో లేకుంటే ప్రధాన మంత్రి మోడీ పిలుపు మహాత్యమో.. చైనా వస్తువులను స్వచ్ఛంధంగా నిషేధించారు. సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు చైనా వత్తాసు పలుకుతోంది. అన్ని రకాలుగా అండగా నిలుస్తోంది. అందుకే చైనా అంటేనే భారతీయులు విసుక్కుంటున్నారు. ఈ కారణంతోనే చైనా వస్తువులను ప్రజలు పక్కనబెట్టేస్తున్నారు. 
 
ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఆట వస్తువుల వరకు, పూలు ప్రమిదల నుంచి అలంకరణ సామాగ్రి వరకు, ఆభరణాలు మొదలు టపాసుల వరకు ఏదీ కావాలన్నా ఢిల్లీ సదర్ బజారుల్లో కొనేస్తున్నారు. ఇక్కడ దొరకని వస్తువంటూ ఏదీ లేదు. మన దేశంలో తయారయ్యే వస్తువులతో పాటు విదేశీ వస్తువులు కూడా ఇక్కడ విక్రయిస్తారు. అది కూడా తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయిక్కడ. 
 
నిన్నమొన్నటి వరకు ఇక్కడ చైనా వస్తువులదే హవా. కానీ ప్రస్తుతం సీన్ మారింది. మోడీ ఇచ్చిన పిలుపుకు భారత ప్రజలు బాగానే స్పందించారు. మనదేశంలోకి చైనా వస్తువులను రప్పించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతో గల చైనాకు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదిక ద్వారా షాక్ ఇస్తూ.. దేశ ప్రజలకు ఒక పిలుపును కూడా ఇచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించాలని కోరారు.
 
మోడీ విజ్ఞప్తితో ఢిల్లీ సదర్ బజార్‌లో చైనా వస్తువులను బహిష్కరించారు. చైనా వస్తువులను సదర్ బజార్ వ్యాపారస్తులు పూర్తిగా నిషేధించారు. మేక్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్‌ను మాత్రమే విక్రయిస్తామని తేల్చి చెప్పేశారు. నష్టాలు వచ్చినా మన సంపద మనకే ఉండాలనే నినాదంతో చైనా బ్రాండ్స్‌ను పక్కనబెట్టేశారు. ప్రధాని విజ్ఞప్తితో ప్రజల్లో కూడా మార్పు కనిపిస్తోంది. స్వదేశీ వస్తువులనే కొంటున్నారు. 
 
గతేడాదితో పోల్చితే ఈసారి లాభాలు కాస్త తగ్గినా స్వదేశీ వస్తువులు అమ్ముడు పోవడంపై వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. చైనా బ్రాండ్స్‌ను పూర్తిగా నిషేధిస్తే దేశీయంగా తయారు చేసిన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. మరి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని సర్కారు.. చైనా బ్రాండ్స్‌పై నిషేధం విధిస్తుందా?