విజయవాడ: భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ రిటైల్ సంస్థలలో ఒకటైన ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (AMPL) విజయవాడలో ఇవాళ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మహీంద్రా డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మహీంద్రా నుండి వీపీ- సేల్స్, కస్టమర్ కేర్ & సీఎక్స్ పవన్ కుమార్, ప్రెసిడెంట్ & నేషనల్ సేల్స్ హెడ్ బనేశ్వర్ బెనర్జీ మరియు ఇరు సంస్థల నుంచి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
విజయవాడలోని ఏలూరు రోడ్డు, ఎనికెపాడులో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ఆధునిక 3ఎస్ (సేల్స్, సర్వీస్, స్పేర్స్) సౌకర్యం 1.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 14 వాహనాలను ఒకేసారి ప్రదర్శించగల విశాలమైన షోరూమ్ ఉంది. మహీంద్రా విస్తృత శ్రేణి వాహనాలు - ప్యాసింజర్ వెహికల్ (ఐసీఈ & ఈవీ), స్మాల్ కమర్షియల్ వెహికల్ (ఎస్‌సీవీ), లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎల్‌ఎంఎం) అన్నీ ఒకే చోట లభిస్తాయి. ఈ కొత్త సౌకర్యం వాహన విక్రయాలు, అమ్మకాల తర్వాత సేవలతో పాటు వాహన ఫాస్ట్-ఛార్జింగ్ సౌకర్యాన్ని అందించేలా రూపొందింది.
ఆధునిక రంగుల సమ్మేళనం, ఆకర్షణీయమైన లైటింగ్, సహజమైన సాంకేతికతతో షోరూమ్‌లోని ప్రతి అంశం అభివృద్ధిపరమైన డిజైన్, ఆవిష్కరణ మరియు ఆకర్షించేవిధంగా రూపొందించారు. కస్టమర్‌లు ఈ కేంద్రంలో అడుగుపెట్టగానే కొత్త టెక్నాలజీలను ప్రత్యక్షంగా చూడగలుగుతారు. INGLO అనే ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్‌ఫారమ్, ప్రపంచంలో వేగంగా పనిచేసే MAIA అనే స్మార్ట్ సిస్టమ్, అలాగే హీరో ఫీచర్లు కూడా ఇందులో కనువిందు చేస్తాయి. ఇందులో 61 అధునాతన సర్వీస్ బేలు ఉన్నాయి. ఇవి సంవత్సరానికి సుమారు 28,000 మంది కస్టమర్‌లకు సులభంగా సేవలందించగలవు.
ఈ ప్రారంభంతో, AMPL దేశవ్యాప్తంగా తన విస్తృత నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ గ్రూప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో 135 మహీంద్రా టచ్‌పాయింట్‌లను నిర్వహిస్తోంది. FY 2025లో ఈ గ్రూప్ 37,000 మహీంద్రా వాహనాలను విక్రయించింది. అంటే ప్రతి 13 నిమిషాలకు ఒక వాహనం అమ్ముడుపోయిందనమాట. దీంతో AMPL భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న OEM కోసం అతిపెద్ద సేల్స్, ఆఫ్టర్-సేల్స్ భాగస్వామిగా నిలిచింది.
ఈ ఆవిష్కరణ సందర్భంగా ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ... “దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద అత్యాధునిక 3ఎస్ సౌకర్యమైన 135వ మహీంద్రా సౌకర్యాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. దీని ద్వారా మహీంద్రాతో మా దీర్ఘకాల అనుబంధం మరింత బలోపేతం అవుతున్నందుకు మేం గర్విస్తున్నాం. మహీంద్రాతో మా ప్రయాణం దాదాపు ఏడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇది ఉమ్మడి విలువలు, శ్రేష్ఠత పట్ల నిబద్ధతతో కూడినది. ఆరు రాష్ట్రాలలో బలమైన నెట్‌వర్క్‌తో, మేము కస్టమర్లతో మమేకమయ్యాం. మహీంద్రా అధునాతన సాంకేతిక ఉత్పత్తులు, కస్టమర్-కేంద్రీకృత విధానం, కస్టమర్ అవసరాల పట్ల మా లోతైన అవగాహనతో వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తాం” అని పేర్కొన్నారు.
రూ.15 కోట్లతో దీన్ని స్థాపించారు. కాగా.. ఇది ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (AMPL) కృష్ణా జిల్లాలో ఐదో డీలర్‌షిప్ అవుట్‌లెట్‌గా నిలుస్తుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఈ జిల్లాలో మరో రెండు కొత్త కేంద్రాలను స్థాపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.