శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2019 (16:56 IST)

కొత్త బజాజ్ పల్సర్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు.. అందుబాటులోకి ధర?

దేశీయ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో తాజాగా మరో కొత్త పల్సర్ బైక్‌ను మార్కెట్లో‌కి తీసుకువచ్చింది. టూవీలర్లలో బజాజ్ పల్సర్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు విడుదలైంది పల్సర్ 125 నియాన్.


దీని ధర రూ.64,000 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. అయితే ఈ మోడల్ రెండు వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ఒకటి డ్రమ్ బ్రేక్ వెర్షన్, రెండవది డిస్క్ బ్రేక్ వేరియంట్‌లో కస్టమర్‌లకు అందుబాటులో ఉండనున్నాయి. 
 
డ్రమ్ బ్రేక్ ధర వచ్చి రూ.64,000, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర వచ్చి రూ.66,618. ప్రీమియం కమ్యూటర్స్ లక్ష్యంగా ఈ బైక్‌ను లాంచ్ చేసినట్లు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు. అద్భుతమైన ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన ధరలో అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు.
 
5 స్పీడ్ గేర్‌బాక్స్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, నియాన్ యాసెంట్‌తో కూడిన గ్రాఫిక్ స్కీమ్, కలర్ కోఆర్డినేటెడ్ పల్సర్ లోగో, గ్రాబ్ రెయిల్, రియర్ కౌల్‌పై 3డీ వేరియంట్ లోగో, బ్లాక్ అలాయ్ మీద నియాన్ కలర్డ్ స్టీక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.