సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2019 (16:48 IST)

జియోమీ ఏ3 మొబైల్ ఫోన్ వచ్చేస్తోంది.. అమేజాన్‌లో 21 నుంచి?

భారతదేశ మొబైల్ రంగంలో జియోమీ సంస్థ ముందుకు దూసుకుపోతోంది. తాజాగా షావోమీ సంస్థ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. జియోమీఆండ్రాయిడ్ వన్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాకు రాబోతోంది. ఈ సంస్థ ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎంఐ ఏ1, ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. 
 
త్వరలో ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎంఐ ఏ3 భారత్‌లో ఆగస్ట్ 23వ తేదీన రిలీజ్ కావచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత నెలలో స్పెయిన్‌లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
 
జియోమీ ఏ3 ప్రత్యేకతలు:
* 6.1 ఇంచ్‌ల అమొలెడ్ డిస్‌ప్లే,
* 4జీబీ, 6జీబీ ర్యామ్,
* 64జీబీ, 128జీబీ ఇంటర్నెల్ స్టోరేజీ
* స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్
 
* 8 వాట్ ఛార్జర్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
* 48+8+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
* 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 4,030 ఎంఏహెచ్ బ్యాటరీ
 
* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది
* కలర్స్: బ్లూ, వైట్, గ్రే
 
ధర:
4జీబీ+64జీబీ- సుమారు రూ.19,300
6జీబీ+128జీబీ-సుమారు రూ.21,600