గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (12:18 IST)

మార్చి నెలలో 11 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు

దేశవ్యాప్తంగా బ్యాంకులు మార్చి నెలలో 11 రోజుల పాటు మూతపడనున్నాయి. ప్రతి నెలా సాధారణంగా నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు సెలవు దినాలు.

రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో వివిధ రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవు దినాలు ఉండనున్నాయి. మార్చి 5, 11, 22, 29, 30వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయని ఆర్బీఐ మార్గదర్శకాలు వెల్లడించాయి.  
 
మార్చి 11న (గురువారం) మహాశివరాత్రి, మార్చి 30న (మంగళవారం) హోలీ పండుగలు వస్తున్నాయి. దీంతో ఈ రెండు రోజుల్లో మనదగ్గర బ్యాంకులకు సెలవులు ప్రకటించనున్నారు. మార్చి నెల మధ్యలో బ్యాంకు యూనియన్లు సమ్మెకు దిగే అవకాశం కనిపిస్తోంది.