శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (22:09 IST)

27-02-2022 నుంచి 05-03-2022 వరకు మీ వార రాశిఫలాలు

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయానికి తగ్గటుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా వ్యక్తం చేయండి. సోమ, మంగళవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతాన సౌఖ్యం, ధనలాభం పొందుతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పొదుపు పథకాల దిశగా ఆలోచనలుంటాయి. ప్రైవేట సంస్థల్లో మదుపు తగదు. బుధవారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి అధికం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆకస్మిక ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. గురు, శుక్రవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆప్తులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. అధికారులకు కొత్త బాధ్యతలు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ప్రతికూలతలు అధికం. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆది, సోమవారాల్లో చేసిన పనులే చేయవలసి వస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. శంకుస్థాపనలకు అనుకూలం. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో చుక్కెదురవుతుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. కార్యం సిద్ధిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుక్ర, శనివారాల్లో ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. కీలకపత్రాలు అందుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. అటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. వృత్తుల వారికి ఆశాజనకం. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ప్రతి విషయంలోనూ మీదే చేయి. సమర్థతను చాటుకుంటారు. మీ ప్రమేయంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. మంగళ, బుధవారాల్లో పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. గృహ మరమ్మతులు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. పెద్ద మొత్తం నగదు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి.
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధికాదు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఒక వ్యవహారంలో జోక్యం చేసుకోవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పధకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, నగదు ప్రోత్సాహకరం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం ఉపశమనం కలిగిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఇరువర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ధనమూలక సమస్యలెదురవుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాల. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, శ్రమ అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 123 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. గురు, శుక్ర వారాల్లో గుట్టుగా యత్నాలు సాగించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో చర్చలు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాహనం పిల్లలకివవ్వద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. శుభవార్తలు వింటారు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆది, సోమవారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. ప్రారంభోత్సవాలకు అనుకూలం, పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి, విద్యార్ధులకు ఒత్తిడి, అధికం. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
ఆర్థిక స్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చీలికి మాటికి అసహనం చెందుతారు. మంగళ, గురు వారాల్లో ధన సమస్యలెదురవుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. అయిన వారితో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వృత్తుల వారికి కష్టకాలం రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం కార్యక్రమాలు వాయిదా పడతాయి. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ప్రేమానుబంధాలు బలపడతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. బుధవారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయంలో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు ధనప్రలోభం తగదు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.