శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (21:55 IST)

20-02-2022 నుంచి 26-02-2022 వరకు మీ వార రాశిఫలాలు

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. నగదు స్వీకరణలో జాగ్రత్త. వేడుకను ఘనంగా చేస్తారు. ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కొత్త బంధుత్వాలేర్పడతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అది, మంగళ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆందోళనతగ్గి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఆకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభం గడిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ప్రతికూలతలు అధికం. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు కొనసాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. మొండి బకాయిలపై దృష్టి పెడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. బుధ, గురువారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వేడుకకు హాజరవుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వాహనచోదకులకు దూకుడు తగదు. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ వాక్కు ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఓర్పుతో పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. సంతానం విజయం ఉల్లాసాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాస్తుకు అనుగుణంగా గృహమార్పులు చేపడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
పంతాలు, భేషజాలకు పోవద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. సోమ, బుధవారాల్లో రుణ ఒత్తిళ్లు ఎదురవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గృహమార్పు అనివార్యం. ఆధ్యాత్మిక, యోగా విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగాలి. ఆదివారం నాడు పనులు సాగవు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాల పై దృష్టి పెడతారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఒక సంఘటన బాధిస్తుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
మంచి పని చేసి ప్రశంసలందుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యతిరేకులతో అవగాహన నెలకొంటుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. హామీలిచ్చే విషయంలో జాగ్రత్త. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. బెబ్బుకు ఇబ్బంది ఉండదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సుప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయము ఖచ్చితంగా వ్యక్తం చేయండి. ఉద్యోగ కార్యక్రమం ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
అన్ని రంగాల వారికి బాగుంటుంది. శుభకార్యాన్ని ఆడంబరంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం అందుకుంటారు. పెట్టుబడులు కలిసివస్తాయి. బుధవారం నాడు పత్రాలు సమయానికి కనిపించవు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్మాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. అకౌంట్స్, మార్కెట్ రంగాల వారికి పనిభారం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషాన్నిస్తుంది, వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, అధికారులకు హోదామార్పు, స్థానచలనం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఈ వారం యోగదాయకమే. కార్యంసిద్ధిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. గృహ మరమ్మతులు చేపడతారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అక్కౌంట్ రంగాల వారికి పనిభారం. బెట్టింగులు, జూదాలకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆర్థిక స్థితి నిరాశాజనకం. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. సాయం చేసేందకు అయిన వారే వెనుకాడుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల రాక ఊరటనిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అనుభవజ్ఞులతో సంప్రదింపులు జరుపుతారు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ ఇషాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆత్మీయులతో సంభాషణ ధైర్యానిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గృహమార్పు అనివార్యం. ఆది, సోమవారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. పనివారలతో కొత్త సమస్యలెదురవుతాయి. అహ్వానం అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. అకౌంట్స్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం. వాహనయోగం ఉన్నాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనులు సానుకూలం  అవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. మంగళ, బుధ వారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు, పనిభారలకు ఆశాజనకం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రయాణం విరమించుకుంటారు.