1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 19 డిశెంబరు 2023 (18:32 IST)

రాయచోటిలో డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ ప్రాథమిక కంటి సంరక్షణ కేంద్రం

Dr Agarwal's eye clinic launch
భారతదేశములోని అతిపెద్ద కంటి సంరక్షణా కేంద్రాలలో ఒకటైన డాక్టర్ అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ ఈరోజు రాయచోటిలో తన ప్రాథమిక కంటి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. రాయచోటి ఎమ్మెల్యే శ్రీ జి.శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి డా అగర్వాల్స్ ఐ క్లినిక్‌ను ప్రారంభించారు. డా అగర్వాల్స్ ఐ క్లినిక్ ఒక ఆధునిక కంటి సంరక్షణ సదుపాయము. ఇందులో నిపుణులైన వైద్యులు సంపూర్ణ కంటి ఆరోగ్య చెక్-అప్స్ అందిస్తారు. ఈ కేంద్రములో రిఫ్రాక్షన్ డిగ్రీ, కంటి ఒత్తిడి, విజువల్ తీక్షణతలను ఖచ్ఛితంగా అంచనావేయుటకు, కంటి శుక్లాలను ప్రారంభదశలోనే కనుగొనుటకు అత్యాధునిక ఉపకరణాలు ఉన్నాయి. ఎవరైనా ఈ కంటి ఆసుపత్రికి వచ్చి ఉచిత సంపూర్ణ కంటి చెక్-అప్, నిపుణులైన వైద్యుల నుండి ఉచిత కన్సల్టేషన్‌ను అందుకోవచ్చు.
 
ఈ ప్రారంభాన్ని సూచిస్తూ, డా అగర్వాల్స్ ఐ క్లినిక్, రాయచోటి “ఏదైనా లెన్స్ కొనండి ఒక ఫ్రేమ్ ఉచితంగా పొందండి” అనే ప్రారంభ ఆఫర్ తోపాటు ఉచిత శుక్లాల చెక్-అప్స్ కూడా అందిస్తోంది. డా. సుమంత్ రెడ్డి ఎంఎస్, ఎఫ్‎ఎంఆర్‎ఎఫ్, ఎఫ్‎విఆర్‎ఆర్‎ఎఫ్ రీజనల్ హెడ్-క్లినికల్ సర్వీసెస్, డా అగర్వాల్స్ ఐ హస్పిటల్స్, తిరుపతి ఇలా అన్నారు. “దేశవ్యాప్తంగా సంపూర్ణ కంటి-సంరక్షణ అందుబాటులోకి తేవాలనే మా అంకితభావానికి ఫలితమే డా అగర్వాల్స్ ఐ క్లినిక్. ఇది సుశిక్షితులైన ఆప్టోమెట్రిస్ట్స్ మరియు స్థానిక జనాభా యొక్క కంటి సంరక్షణ అవసరాలకు సహకారాన్ని అందించుటకు రెగ్యులర్ గా కేంద్రాన్ని సందర్శించే నిపుణులైన వైద్యుల సమ్మేళనాన్ని అందిస్తుంది.”
 
ఇంకా ఈ సందర్భంగా హాజరైన డాక్టర్ గోపి కృష్ణ పి, డా అగర్వాల్స్ ఐ హస్పిటల్స్, తిరుపతి, ఇలా అన్నారు. “క్లినిక్‌లో వివిధ కంటి పరిస్థితులను నిర్ధారించుటకు, చికిత్స అందించుటకు స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఉపకరణాలు ఉన్నాయి. ఇక్కడి పరిసర ప్రాంతాలలో కూడా నాణ్యమైన కంటి సంరక్షణ లభ్యతను మెరుగుపరచడము కూడా దీని లక్ష్యాలలో ఒకటి. గ్రామీణ జనాభాకు ప్రాథమిక కంటి సంరక్షణ అందుబాటులోకి తేవడము, గ్రామీణ, సెమీ-అర్బన్ జనాభాలో కంటి సంరక్షణ సేవలను అందుకోవడాన్ని పెంచడములో సహాయం చేయడము డా అగర్వాల్స్ ఐ క్లినిక్ లక్ష్యము”.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాయచోటి ఎమ్మెల్యే శ్రీ జి.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, “రాయచోటిలో డా అగర్వాల్స్ ఐ క్లినిక్‌ను ప్రారంభించడం నాకెంతో సంతోషంగా ఉంది. జాగ్రత్తలు తీసుకొని కంటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అన్ని వయసులలో మంచి కంటి చూపును నిలిపి ఉంచటానికి రెగ్యులర్‌గా కంటి చెక్-అప్స్ చేయించుకోవడం ముఖ్యం. డా అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ నుండి కంటి క్లినిక్ బృందము గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు నాణ్యమైన కంటి సంరక్షణ ప్రయోజనాన్ని అందించుటకు చిన్న పట్టణాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నందుకు నేను ధన్యవాదములు తెలుపుతున్నాను అని అన్నారు.