శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:41 IST)

బెంగాల్ ఎన్నికల తర్వాత పెట్రోల్ భారీ వడ్డన.. లీటరుకు రూ.3 వరకు పెంపు

వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత దేశంలో మరోమారు పెట్రోల్, డీజల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 9 దశల్లో బెంగాల్ ఎన్నికలు జరుగుతుండగా, బుధవారం ఆరో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. 
 
లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ధర రూ.3 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ముడి చమురు సంస్థలకు వచ్చే నష్టాలను పూడ్చుకోవడానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాల కథనం. కాగా, ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన వెల్లడికానున్నాయి. 
 
ఇదిలావుంటే, ఈ యేడాదిలోనే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు 26 సార్లు పెంచేసింది. జనవరిలో 10 సార్లు, ఫిబ్రవరిలో 16 సార్లు పెంచింది. కానీ మార్చిలో ముచ్చటగా మూడుసార్లు, ఈ నెలలో ఇప్పటివరకు ఒకసారి వీటి ధరలు తగ్గించింది. చివరిగా ఫిబ్రవరి 27వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ నెల 16వ తేదీన చివరిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.