బ్యాంక్ ఖాతాదారులకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా బ్యాంక్ కస్టమర్‌లకు తీపి కబురు అందించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఆ సంస్థ ఒక అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. బ్యాంకులపై కంప్లైంట్ చేయడానికి వినియోగదారులు ఈ పోర్టల్‌ను ఆశ్రయించవచ్చు. దీని పేరు కార్పొరేట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎంఎస్).
ఇందులో భాగంగా ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఎడమవైపున కరెంట్ రేట్స్ కింద ఒక విండో కనిపిస్తుంది. దీనిపై ఆర్‌బీఐ లోగో ఉంటుంది. ఈ లోగోపై క్లిక్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే కస్టమర్‌లు ఏ బ్యాంక్‌కు సంబంధించిన వారైనా ఇందులో ఫిర్యాదు చేసే వీలుంది.
ఫిర్యాదు చేసిన తర్వాత కస్టమర్‌లు అప్‌డేట్‌లు కూడా తెలుసుకోవచ్చు. కస్టమర్‌లకు ఏవైనా సమస్యలుంటే https://cms.rbi.org.in/cmc/indexPage.aspx?aspxerrorpath=/cms/indexpage.aspx లింక్ సాయంతో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.