ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2016 (11:30 IST)

పెట్రోల్ బంకుల్లో మొబైల్ పేమెంట్లు వద్దు.. పేలితో బాధ్యత ఎవరు?

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో పేటీఎంల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. అలాగే, ఆన్‌లైన్ పేమెంట్లు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో... పెట్రోల్ బంకుల్లో మాత్రం మొబైల్ పేమెంట్ చెల్లింపులు వద్దని పెట్రోల్ బంకు యజ

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో పేటీఎంల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. అలాగే, ఆన్‌లైన్ పేమెంట్లు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో... పెట్రోల్ బంకుల్లో మాత్రం మొబైల్ పేమెంట్ చెల్లింపులు వద్దని పెట్రోల్ బంకు యజమానులు కోరుతున్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు మొబైల్ పేలితో దానికి బాధ్యత ఎవరు వహిస్తారన్నది వారి ప్రశ్నగా ఉంది. 
 
వాస్తవానికి పెట్రోల్ బంకుల్లో మొబైల్ వాడకం నిషేధం. మొబైల్ వాడొద్దంటూ పలు పెట్రోల్ బంకుల్లో హెచ్చరిక చేస్తూ పోస్టర్స్ కూడా ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. క్యాష్‌లెస్ ఎకానమీని ప్రవేశపెట్టేందుకు కార్డు లావాదేవీలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. 
 
ఇప్పటికే దేశవ్యాప్తంగా పేటీఎం ద్వారా నగదు చెల్లింపులు భారీగా పెరిగాయి. అయితే పేటీఎం ద్వారా పెట్రోల్ బంకుల్లో నగదు చెల్లింపులు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని కొందరు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో మొబైల్ పేలే ప్రమాదముందని, అలాంటి ఘటనలు కూడా గతంలో జరిగాయని చెబుతున్నారు. అలాంటివి చూసి కూడా పెట్రోల్ బంకుల్లో మొబైల్ ద్వారా చెల్లింపులు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు.
 
పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజన్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పెసో) కూడా సదరు మంత్రిత్వ శాఖను హెచ్చరించింది. పెట్రోల్ బంకుల్లో ఈపోస్ మిషన్ల వాడకాన్ని నిలిపివేయాలని, బంకుల్లో నోట్ల ద్వారానే చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించింది. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా పునరాలోచించాలని భావిస్తోంది. పెట్రోల్ బంకుల్లో మొబైల్ ద్వారా నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని భావిస్తోంది.