సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (14:23 IST)

పీఎఫ్ పెన్షన్ డబ్బులను రెట్టింపు చేస్తారా?

పీఎఫ్ పెన్షన్ డబ్బులను రెట్టింపు చేసే అవకాశాలున్నాయి. ఎంప్లాయీస్ ప్రీవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్ కింద ఇప్పుడు సబ్‌స్క్రైబర్లకు నెలకు రూ.1000 పెన్షన్‌ని ఇస్తోంది. నిజానికి ఈ అమౌంట్ చాలా తక్కువ. 
 
అందుకే ఈ డబ్బులను పెంచాలని పార్లమెంట్ కమిటీ అంటోంది. పార్లమెంట్ స్టండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ 2022-23ని పార్లమెంటుకు సమర్పించింది.
 
ఇందులో పీఎఫ్ పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఇందుకు ఇంకా అంగీకరించలేదు. కనీస పెన్షన్‌ను రూ.1000గానే కొనసాగించింది. 
 
అలానే పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు మరీ ముఖ్యంగా 2015 కన్నా ముందు పదవీ విరమణ చేసిన వారు ఇనామినేషన్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నివేదిక చెబుతోంది.