శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 30 నవంబరు 2018 (14:33 IST)

కొత్త పాన్ కార్డు దరఖాస్తులో తండ్రి పేరు అక్కర్లేదు... కానీ...

ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు, ఇతర ఆర్థిక లావాదేవీల కోసం పర్మినెంట్ అకౌంట్ - పాన్ (శాశ్వత ఖాతా నంబరు) తప్పనిసరి. అలాంటి పాన్ నంబరు నిబంధనలు మార్చారు. ఇదే విషయంపై సెంట్రల్ బోర్డు డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఐదు నిబంధనలను కొత్తగా అమల్లోకి తెచ్చింది. ఒక యేడాదికి రూ.2.5 లక్షలు ఆపై వ్యాపారం చేసేవారందూ విధిగా కొత్త నిబంధనలతో కూడిన పాన్ కార్డును తప్పనిసరిగా తీసుకోవాలని అందులో స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబరు 5వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ నిబంధనలను ఓసారి పరిశీలిస్తే, 
 
1. ఒక యేడాదికి 2 లక్షల రూపాయలు లేదా అంతకు మించి లావాదేవీలు చేసే వారందరూ పాన్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి. 
2. వ్యాపార వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారందరూ విధిగా పాన్ కార్డు కలిగివుండాలి. 
3. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను కొత్త నోటిఫికేషన్‌ను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 
4. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్, భాగస్వామి, వ్యవస్థాపకుడు, కర్త, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రిన్సిపల్ ఆఫీసర్ లేదా ఆఫీస్ బేరర్‌లు తప్పకుండా పాన్ నంబరును కలిగివుండాలి. లేనిపక్షంలో 2019 మే 31వ తేదీలోపు కొత్త పాన్ కార్డును పొందాల్సివుంటుంది. 
5. కొత్త పాన్ కార్డు కోసం చేసుకునే దరఖాస్తులో వ్యక్తి తండ్రిపేరును పేర్కొనడం తప్పనిసరికాదు.