సరికొత్త ప్యాషన్ ప్లస్ డిస్క్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన హీరో మోటోకార్ప్
ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, సరికొత్త 'ప్యాషన్+ డిస్క్'ను మార్కెట్లోకి లాంచ్ చేసినట్లు నేడు ప్రకటించింది. రోజువారీ ప్రయాణికులకు ఆధునిక మొబిలిటీ పరిష్కారాలను అందించాలనే బ్రాండ్ నిబద్ధతను ఈ స్టైలిష్, ఫీచర్-రిచ్ కొత్త వేరియంట్ మరింత బలపరుస్తుంది. పట్టణాల్లో రోజువారీ ప్రయాణాలకు, ఆచరణాత్మక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ మోటార్‌సైకిల్.. అత్యుత్తమ పనితీరు, ఇంధన సామర్థ్యం, సౌకర్యాల మేలు కలయికతో నేటితరం రైడర్లకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.
ఈ లాంచ్ సందర్భంగా హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ వర్మ మాట్లాడుతూ.. సరికొత్త ప్యాషన్+ డిస్క్ విడుదల.. భారతదేశంలో అత్యంత నమ్మకమైన, ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌లలో ఒకటిగా ఉన్న 'ప్యాషన్' వారసత్వాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. సరికొత్త స్టైలింగ్, అధునాతన డిజిటల్ ఫీచర్లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ద్వారా పెరిగిన భద్రత, అత్యుత్తమ మైలేజీతో.. ప్యాషన్+ డిస్క్ నేటి వినియోగదారులకు ఒక అద్భుతమైన ప్యాకేజీని అందిస్తుంది. ఈ కొత్త వేరియంట్ బ్రాండ్ ఆకర్షణను మరింత పెంచడంతో పాటు, ఈ విభాగంలో హీరో మోటోకార్ప్ నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము అని అన్నారు.
ఆధునిక స్టైలింగ్, ఆకర్షణీయమైన డిజైన్ లాంగ్వేజ్
సరికొత్త ప్యాషన్+ డిస్క్ ఒక సరికొత్త వ్యక్తిత్వంతో, సమకాలీన డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తుంది. ప్యాషన్ సిరీస్‌కు ఉన్న ఐకానిక్ లక్షణాలను ఏమాత్రం కోల్పోకుండానే.. నేటి పట్టణ ప్రయాణికుల పెరుగుతున్న ఆకాంక్షలకు అద్దం పట్టేలా దీనిని తీర్చిదిద్దారు. ఆధునిక సౌందర్యానికి, ఇంటెలిజెంట్ ఫంక్షనాలిటీని జోడించే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.. ఈ బైక్ ప్రీమియం లుక్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది. టెక్నాలజీతో కూడిన కనెక్టెడ్ రైడింగ్ అనుభూతి కోసం అధునాతన ఇంటర్‌ఫేస్‌ను ఇది అందిస్తుంది.
మెరుగైన పనితీరు, ఇంధన సామర్థ్యం
ఈ సరికొత్త ప్యాషన్+ డిస్క్.. హీరో మోటోకార్ప్‌కు చెందిన అత్యంత నమ్మకమైన 100cc BS-VI మరియు ఓబిడి- 2 ఫేజ్ A కంప్లైంట్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 8000 rpm వద్ద 5.9kW శక్తిని, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ ప్రయాణాల కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేయబడిన ఈ మోటార్‌సైకిల్, మృదువైన యాక్సిలరేషన్, రిఫైన్డ్ రైడింగ్ క్వాలిటీతో పాటు వివిధ రహదారి పరిస్థితుల్లో నమ్మకమైన పనితీరును కనబరుస్తుంది. కంపెనీ పేటెంట్ పొందిన i3S (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్) టెక్నాలజీతో వస్తున్న ఈ బైక్ 71 kmpl అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. తద్వారా రోజువారీ ప్రయాణికులకు అటు పనితీరు, ఇటు పొదుపు పరంగా ఇది ఆదర్శవంతమైన బ్యాలెన్స్‌ను ఇస్తుంది.
స్మార్ట్ టెక్నాలజీతో భద్రత
రైడర్లలో విశ్వాసాన్ని, భద్రతను పెంపొందిస్తూ.. ఈ సరికొత్త ప్యాషన్+ డిస్క్ బైక్ 'ఫ్రంట్ డిస్క్ బ్రేక్'ను కలిగి ఉంది. ఇది వివిధ రహదారి పరిస్థితుల్లో మరింత వేగంగా స్పందిస్తూ ఖచ్చితమైన బ్రేకింగ్ పనితీరును అందిస్తుంది. ఒక అద్భుతమైన టెక్-ఎనేబుల్డ్ రైడింగ్ అనుభూతి కోసం ఈ కొత్త వేరియంట్‌లో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందుపరిచారు. ఇందులో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ (ఆర్టిఎంఐ), కాల్ మరియు ఎస్ఎంఎస్ అలెర్ట్‌లతో కూడిన బ్లూటూత్ కనెక్టివిటీ, సర్వీస్ రిమైండర్లు, లో-ఫ్యూయల్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, స్పీడోమీటర్ మరియు ఓడోమీటర్ రీడింగ్‌లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా అత్యంత శక్తివంతమైన 'ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్'ను ఇందులో అందించారు. ఇది రాత్రి వేళల్లో, తక్కువ వెలుతురు ఉన్న పరిస్థితుల్లో మెరుగైన విజన్‌ను ఇస్తుంది. సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు బైక్ ముందుకు కదలకుండా నిరోధించేలా ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్‌తో కూడిన 'సైడ్ స్టాండ్ ఇండికేటర్' ఇందులో ఉంది. ఇది రైడర్ భద్రతను మరింత పటిష్టం చేస్తుంది.
సౌకర్యం మరియు కంఫర్ట్
ఎలాంటి శ్రమ లేని రోజువారీ ప్రయాణాల కోసం డిజైన్ చేయబడిన ఈ సరికొత్త ప్యాషన్+ డిస్క్.. రైడర్‌కు మరియు వెనుక కూర్చునే వారికి మెరుగైన రైడింగ్ కంఫర్ట్‌ను అందించేలా అత్యుత్తమ ఎర్గోనామిక్స్‌ను, మృదువైన సౌకర్యవంతమైన సీటును కలిగి ఉంది. దీని రిలాక్స్‌డ్ రైడింగ్ ట్రయాంగిల్ అలసట లేని సహజమైన సీటింగ్ భంగిమను ఇస్తుంది, తద్వారా సిటీలో చేసే సుదూర ప్రయాణాలు కూడా చిన్న ప్రయాణాల మాదిరిగానే చాలా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. రైడర్ల ప్రాక్టికల్ స్టోరేజ్ అవసరాల కోసం విశాలమైన యుటిలిటీ కేసును, అలాగే ప్రయాణంలో కూడా కనెక్టెడ్‌గా ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఇందులో అందించారు.
రంగులు- ధర
ఆధునిక స్టైలింగ్‌కు అనుగుణంగా, ఈ ప్యాషన్+ డిస్క్ నాలుగు ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ రంగుల్లో లభిస్తుంది. హెవీ గ్రే, నెక్సస్ బ్లూ, డార్క్ ఇండస్ట్రియల్ గ్రే మరియు పెరల్ రెడ్ రంగుల్లో ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌లలో రూ. 84,128/- ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తుంది.
