బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (11:49 IST)

రూ.70 నుంచి రూ.300లకు పెరగనున్న పెట్రోల్ ధరలు..?

సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నెలకుంటే.. దాని ప్రభావం క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడుతుందని.. దీంతో లీటర్ పెట్రోల్ రూ.300లకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొ

సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నెలకుంటే.. దాని ప్రభావం క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడుతుందని.. దీంతో లీటర్ పెట్రోల్ రూ.300లకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే దాని ప్రభావం క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడుతుందని.. ప్రధానంగా రెండు దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే భారతీయ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇంధన మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
ఇంకా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్‌లో ప్రస్తుతం రూ.70 రూపాయలకు దొరుకుతున్న లీటర్ పెట్రోల్ ధర రూ.300లకు పెరిగే అవకాశం వుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అక్కడితో ఆగిపోతే ప్రశాంతంగా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.