మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 మే 2018 (12:15 IST)

తూచ్... 60 పైసలు కాదు.. ఒక్క పైసా మాత్రమే తగ్గించాం...

దేశవ్యాప్తంగా పెట్రోల్ - డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ లేదా కేంద్ర మంత్రుల్లో ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు.

దేశవ్యాప్తంగా పెట్రోల్ - డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ లేదా కేంద్ర మంత్రుల్లో ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు.
 
ఈ నేపథ్యంలో వరుసగా 19 రోజుల పాటు పరుగాపకుండా పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు, బుధవారం 60 పైసలు తగ్గాయని వాహనదారులు పడ్డారు. కానీ ఆనందం మూడు గంటల ముచ్చటే అయింది. పెట్రోలు, డీజిల్ ధరల సవరణలో పొరపాటు జరిగిందని, తగ్గింది 60 పైసలు కాదని, ఒక్క పైసా మాత్రమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.
 
బుధవారం పెట్రోలు ధరను 60 పైసలు, డీజెల్ ధరను 59 పైసలు తగ్గిస్తున్నట్టు ఐఓసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చేసిన తప్పును గుర్తించి.. తగ్గించిన ధరకు సవరణ చేసింది. దీంతో లీటరు పెట్రోల్‌పై కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గించింది.