మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 మే 2018 (15:17 IST)

70 యేళ్ళ చరిత్రలో తొలిసారి... చేతులెత్తేసిన ప్రధాని మోడీ

దేశ చరిత్రలోనే ఎన్నూడూ చూడని విధంగా పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఈ ధరలను అదుపు చేయలేక ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.08కి చేరగా, డీజిల

దేశ చరిత్రలోనే ఎన్నూడూ చూడని విధంగా పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఈ ధరలను అదుపు చేయలేక ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.08కి చేరగా, డీజిల్ రూ.75.35కి చేరింది. అలాగే, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.86కు చేరింది.
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ధరల పెరుగుల నిత్యావసర వస్తు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా నిత్యావసర వస్తు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇటు వాహనదారులు బెంబేలెత్తిపోతుంటే.. అటు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 
 
15 రోజుల క్రితం ఉన్న ధరలతోపోల్చితే.. ఇప్పుడు 5 నుంచి 10 రూపాయల ధరలు పెరిగాయని చెబుతున్నారు వినియోగదారులు. నాలుగు రోజుల క్రితం వరకు రూ.15 ఉన్న ఆలుగడ్డ.. ఇపుడు రూ.25కి చేరింది. అదేవిధంగా బెండకాయలు రూ.32, టమోటా రూ.20, పచ్చిమిర్చి రూ.50, దొండ రూ.20, బీట్ రూట్ రూ.17, వంకాయ రూ.20, క్యారెట్ రూ.25, క్యాలిఫ్లవర్ రూ.50, బీరకాయ రూ.50, ఫ్రెండ్ బీన్స్ రూ.90గా ఉన్నాయి.