ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 మే 2017 (16:34 IST)

ఇకపై ఇంటికే రైల్వే టిక్కెట్లు.. ఐఆర్‌సీటీసీ డోర్ డెలివరీ ఫెసిలిటీ

భారతీయ రైల్వే శాఖకు చెందిన అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త తెలిపింది. రైల్వే టిక్కెట్లను డోర్ డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. టిక్కెట్లను డోర్ డెలివరీ ద్వారా అందుకున్న తర్వాత క్యాష

భారతీయ రైల్వే శాఖకు చెందిన అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త తెలిపింది. రైల్వే టిక్కెట్లను డోర్ డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. టిక్కెట్లను డోర్ డెలివరీ ద్వారా అందుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో నగదు చెల్లించే వెసులుబాటును కూడా కల్పించింది. 
 
అయితే, టిక్కెట్ రిజర్వేషన్ సమయంలో ఖచ్చితంగా పాన్ లేదా ఆధార్ కార్డు నంబరు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే, టిక్కెట్లను ఇంటికి తెచ్చే డెలివరీ బాయ్‌కు వీటిని చూపించాలి. టిక్కెట్లను బుక్ చేసే సమయంలో పే ఆన్ డెలివరీ (పీఓడీ) అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న వారికే డోర్ డెలివరీ టిక్కెట్లు లభ్యమవుతాయి. 
 
అలా ఎంపిక చేసుకోవడం ద్వారా టిక్కెట్టు డోర్ డెలివరీ అయిన తర్వాత సదరు ప్రయాణికుడు నగదు చెల్లించేందుకు తోడ్పడుతుంది. అయితే, ఈ పద్ధతిలో రైల్వే టిక్కెట్లను కొనుగోలు చేస్తే అదనంగా కొంత రుసుము వసూలు చేస్తారు. రూ.5 వేల లోపు కొనుగోలుకు రూ.90 వరకు, రూ.5 వేలకు పైబడితే రూ.120 చార్జీ కింద వసూలు చేయనున్నారు. 
 
ఈ తరహా టిక్కెట్లు పొందడానికి ప్రయాణికులు తమ ప్రయాణానికి గరిష్టంగా ఐదు రోజుల ముందుగా కూడా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ విధానంలో బుక్ చేసిన టిక్కెట్లను ఒకవేళ క్యాన్సిల్ చేయదలిస్తే.. ఆ టిక్కెట్లు డోర్ డెలివరీ అయ్యేలోగానే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను, క్యాన్సిలేషన్, డోర్ డెలివరీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. 
 
కాగా, ఐఆర్సీటీసీ సైట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసే వినియోగదారులు డోర్ డెలివరీ సదుపాయాన్ని పొందాలంటే, మొబైల్ ఓటీపీ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికే ఐఆర్సీటీసీ ఖాతాలు కలిగినవారు ఈ సేవను సంబంధిత సైట్‌లోకి వెళ్లి ఉపయోగించుకోవచ్చు.