మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 25 మే 2020 (23:04 IST)

ఖాతాబుక్ రూ. 454 కోట్ల నిధుల సేకరణతో దక్షిణ భారతదేశం ఎంఎస్ఎంఇలకు లాభం

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలను నమోదు చేయడానికి, వ్యాపార లావాదేవీలను ట్రాక్ చేయడానికి సహాయపడే ప్రముఖ యుటిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఖతాబుక్, బి కాపిటల్ గ్రూప్ సహ-నేతృత్వంలోని మరియు ఇప్పటికే ఉన్న మదుపరులు సీక్వోయియా ఇండియా, డిఎస్‌టి పార్టనర్స్ ద్వారా రూ. 454 కోట్ల సిరీస్ బి రౌండ్ నిధులను క్లోజ్ చేసింది.
 
తాజా నిధులు ఖాతాబుక్ భారతదేశ వ్యాపారులకు దాని ఉత్పత్తి మరియు సేవా సమర్పణలను పెంచడానికి అనుమతిస్తుంది. ఎందుకంటే సంస్థ ఆర్థిక సేవల చుట్టూ సాంకేతిక పరిష్కారాలను అందించడంలో మరియు పెద్ద వ్యాపారి-కేంద్రీకృత పంపిణీ వేదికపై దూసుకుపోతుంది.
 
నేడు, దక్షిణ భారతదేశంలోని 75 లక్షల మంది నమోదు చేసుకున్న వ్యాపారులు నగరాలలో మరియు పట్టణాలలో తమ రోజువారీ వ్యాపారాలను నిర్వహించడానికి ఖాతాబుక్‌ను ఉపయోగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో, కిరాణా మరియు సాధారణ దుకాణాలు, మొబైల్ షాపులు, ఆటోమొబైల్ షాపులు మరియు కంప్యూటర్ స్టోర్లలో నడుస్తున్న వారిలో భాషా అడ్డంకులను అధిగమించడానికి యాప్ లోని స్థానికీకరణ సహాయపడింది. చిన్న మరియు మధ్య తరహా ఫార్మసీలు, బేకరీలు, హార్డ్‌వేర్ దుకాణాలు, రీఛార్జ్ షాపులు, పాన్ షాపులు, స్టేషనరీ దుకాణాలు, బట్టల దుకాణాలతో పాటు స్వతంత్ర కాంట్రాక్టర్లలో కూడా ఖాతాబుక్ యాప్ బాగా ప్రాచుర్యం పొందింది.
 
"భారతదేశంలో 80 లక్షలకు పైగా నెలసరి క్రియాశీల వినియోగదారులతో దేశంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా వ్యాపార విభాగంలో ఖాతాబుక్ అతిపెద్ద సంస్థగా మారింది. ఎంఎస్‌ఎంఇల డిజిటలైజేషన్‌లో ఖాతాబుక్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది - ఇది మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. ఇది వ్యాపారుల ఆదాయాలను పెంచడానికి మరియు వాటిని మరింత సమర్థవంతంగా మరియు పోటీతత్వంగా మార్చడానికి సహాయపడుతుంది.

కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళలోని అనేక ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని వ్యాపారులు తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి ఖతాబుక్‌ను ఉపయోగిస్తున్నారు. మేము ఎంఎస్‌ఎంఇలను బలోపేతం చేయడానికి ప్రభుత్వ మరియు ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నాము" అని ఖతాబుక్ సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఓ రవీష్ నరేష్ అన్నారు.
 
ఉత్పత్తి రూపకల్పనలో మధ్యలో చిన్న వ్యాపారుల అవసరాలపై దృష్టిసారించినప్పుడు ఖాతాబుక్ వారి డిజిటల్-మొదటి వినియోగదారు సముపార్జన విధానం అనేది మార్కెట్లో శక్తివంతమైన స్థానాన్ని అందజేసింది. ఈ యాప్‌ను నమోదు చేసుకున్న వ్యాపారులు 11 భాషలలో ఉపయోగిస్తున్నారు.
 
“భారతదేశంలోని 6 కోట్ల మంది వ్యాపారులను డిజిటల్‌గా మార్చడానికి వీలు కల్పిస్తున్న ఖాతా బుక్‌తో భాగస్వామ్యం కావడానికి మేము ఎంతో ఉత్సాహంతో సంతోషిస్తున్నాము. మేము ఈ సంస్థను నిశితంగా గమనిస్తున్నాము మరియు క్రెడిట్, రెవెన్యూ లీకేజ్ మరియు సేకరణలలో వ్యాపారులకు క్లిష్టమైన పెయిన్ పాయింట్లను పరిష్కరించేటప్పుడు దాని ఉత్పత్తుల సూట్ ద్వారా ఆకట్టుకుంటాము.
 
రాబోయే మూడేళ్లలో డిజిటల్ అధునాతన ఎంఎస్‌ఎంఇల సంఖ్య రెట్టింపు అవుతుందని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులతో, వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఖాతాబుక్ వంటి విశ్వసనీయ డిజిటల్ సాధనాలు మరింత అవసరం.” అని బి క్యాపిటల్ గ్రూప్ జనరల్ పార్టనర్ & ఆసియా కో-హెడ్ కబీర్ నారంగ్ అన్నారు
 
ఖాతాబుక్ వారి సాఫ్ట్‌వేర్‌ను సరళంగా మరియు వ్యాపారులకు సహజంగా అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించడం వలన అధిక స్వీకరణ, నియామకం మరియు నిలుపుదలకి దారితీసింది. 10 లక్షలకు పైగా వ్యాపారులు ప్రతిరోజూ రూ. 1500 కోట్ల లావాదేవీలను జోడిస్తూండటంతో ఈ యాప్ బ్రహ్మాండమైన ప్రజాదరణ పొందిందని స్పష్టంగా తెలుస్తూంది. ప్లాట్‌ఫారమ్ యొక్క అధిక నియామకం మరియు వినియోగ ఫలితంగా 25% కంటే ఎక్కువ మంది వ్యాపారులు వర్డ్-ఆఫ్-నోట్ మరియు రిఫరల్స్ ద్వారా ప్లాట్‌ఫారమ్‌లో చేరారు.