1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 9 జులై 2021 (20:08 IST)

నూతన సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌ శ్రేణి విడుదల చేసిన మహీంద్రా

భారతదేశంలో సుప్రసిద్ధ ఆటోమొబైల్‌ కంపెనీలలో ఒకటి కావడంతో పాటుగా వాల్యూమ్స్‌ పరంగా ప్రపంచంలో అతి పెద్ద ట్రాక్టర్‌ కంపెనీగా నిలిచిన మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌ నేడు తమ నూతన శ్రేణి సుప్రో ప్రాఫిట్‌ ట్రక్స్‌ను విడుదల చేసింది.

విజయవంతమైన సుప్రో ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేసిన ఈ నూతన శ్రేణి కార్గో వాహనాలు అత్యంత అందుబాటు ధరలలో ఉండటంతో పాటుగా మరింత శక్తివంతంగా, అత్యధిక బరువును మోసుకువెళ్లే సామర్థ్యంతో పాటుగా అధిక మైలేజీకి సైతం భరోసా కల్పిస్తూ వినియోగదారులకు మరింత ఎక్కువ లాభాలను అందిస్తాయి.
 
ఈ ఆవిష్కరణ గురించి ఎంఅండ్‌ఎం లిమిటెడ్‌ ఆటోమోటివ్‌ డివిజన్‌ సీఈవో వీజె నక్రా మాట్లాడుతూ, ‘‘మా వినియోగదారులు అభిమానించే అత్యంత విజయవంతమైన చిన్న వాణిజ్య వాహనం సుప్రో. నూతన సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌తో మేము గణనీయంగా ఉత్పాదక ప్రతిపాదనను వృద్ధి చేయడంతో పాటుగా వినియోగదారులకు లాభదాయకతనూ వృద్ధిచేయడంపై దృష్టి సారించాం. సరసమైన ధరలోనే  ఇది లభించినప్పటికీ, తమ శ్రేణిలో అసాధారణ పనితీరు, ఇంధన సామర్థ్యం, డీజిల్‌ మరియు సీఎన్‌జీ పవర్‌ట్రైన్స్‌ అవకాశాలను అందిస్తుంది...’’ అని అన్నారు.
 
సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌ ఇప్పుడు ఆకర్షణీయమైన ఫైనాన్స్‌ అవకాశాలలో సైతం లభిస్తుంది. ఐదు సంవత్సరాల కాల పరిమితితో 12.99% వడ్డీ రేటును వినియోగదారులు పొందడం వల్ల అతి తక్కువ ఈఎంఐ చెల్లించే అవకాశమూ కలుగుతుంది. అంతేకాదు సుప్రో ప్రాఫిట్‌ ట్రక్‌పై 100% లోన్‌నూ వారు పొందవచ్చు.