1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 మే 2023 (22:44 IST)

ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ AERA కోసం ప్రత్యేక ప్రీ-బుక్ ఆఫర్‌ ప్రకటించిన మేటర్

image
సాంకేతిక ఆవిష్కరణ ల ఆధారిత స్టార్టప్ అయిన మేటర్, దాని ఫ్లాగ్‌షిప్ మోటార్‌బైక్, మేటర్ ఏరియా ప్రీ-బుకింగ్‌ ప్రారంభించడం కోసం సన్నద్ధమైనది . ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్ మే 17 నుండి మేటర్, ఫ్లిప్ కార్ట్‌లో దేశంలోని 25 జిల్లాల్లో తెరవబడుతుంది. ప్రీ బుక్ సిటీలు/జిల్లాలు- హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కృష్ణా, బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూర్, మధురై, ముంబై, నవీ-ముంబై, థానే, రాయగఢ్, పూణే, నాగ్‌పూర్, నాసిక్, అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, జైపూర్, ఇండోర్, ఢిల్లీ NCR, పాట్నా, లక్నో, కాన్పూర్, గౌహతి, కమ్రూప్, కోల్‌కతా, భువనేశ్వర్, కటక్ మరియు కోర్ధా.
 
సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా, MATTER AERA మొబిలిటీ మార్చడానికి, కొత్త అనుభవాలను అందించడానికి మరియు రైడింగ్ యొక్క భవిష్యత్తును పునర్నిర్వచించటానికి సెట్ చేయబడింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ముందుగా స్వీకరించేవారు మరియు ఆవిష్కర్తలు AERAని ముందస్తుగా బుక్ చేసుకోగలరు మరియు ప్రత్యేక పరిచయ ధరలు, ఎర్లీ బర్డ్ ఆఫర్‌లు మరియు ఎర్లీ బర్డ్ ప్రీ-బుకింగ్ మొత్తం వంటి ప్రయోజనాలను పొందగలరు. MATTER AERA మొదటి 9,999 ప్రీ-బుకింగ్‌లకు రూ. 5,000/- ప్రత్యేక ధర ప్రయోజనం అందిస్తారు; వినియోగదారులు RS 1999/-  ప్రీబుక్ చేయవచ్చు.