ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 మే 2023 (11:42 IST)

మరో 500 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్

Amazon
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో అస్థిరత నెలకొంది. దీంతో అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అంతర్జాతీయంగా తమ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 9,000 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నట్లు మార్చిలో అమెజాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే భారత్‌లో 500 మందిని ఇంటికి పంపినట్లు సమాచారం. 
 
వెబ్‌ సర్వీసెస్‌, హ్యూమన్‌ రీసోర్సెస్‌, సపోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. వీరిలో కొంత మంది కంపెనీ గ్లోబల్‌ ఆపరేషన్స్‌కు ఇక్కడి నుంచి పనిచేస్తున్న వారున్నారు. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉద్యోగులను పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు సీఈఓ ఆండీ జస్సీ మార్చిలో వెల్లడించిన విషయం తెలిసిందే.
 
కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో డిమాండ్‌ పెరగడంతో అందుకు అనుగుణంగా భారీ ఎత్తున ఉద్యోగులను నియమించనున్నాయి. కానీ, కరోనా పూర్వస్థితికి వ్యాపార కార్యకలాపాలు చేరుకోవడంతో డిమాండ్‌ మళ్లీ తగ్గింది. 
 
మరోవైపు మాంద్యం, వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చాలా కంపెనీలు వ్యయాలను నియంత్రించుకుంటాయి. అందులో భాగంగా మెటా, గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.