1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (14:54 IST)

ఏపీలో సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కారు

Andhra Pradesh Emblem
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వలంటీర్లకు ఆ రాష్ట్ర వైకాపా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో ఉగ్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గత 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పని చేస్తుండగా, ప్రొబెషన్ తర్వాత రెట్టింపు వేతనం అందుకోనున్నారు. వీరంతా గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పని చేస్తున్నారు. 
 
ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వులా జారీ కావడంతో జిల్లాల్లో వేర్వేరుగా జిల్లా కలెక్టర్లు, అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి, డిపార్టుమెంటు టెస్టులో ఉత్తీర్ణత సాధించి, ఎలాంటి నేర చరిత్ర లేని పోలీసు రిపోర్టుల్లో తేలిన వారికి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ కొనసాగించాలన్న నిబంధనలు ఉన్నాయి. దీనిపై ఆయా జిల్లా కలెక్టర్లు కసరత్తులు చేస్తున్నారు.