మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (15:46 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగిసిన పదో తరగతి పరీక్షలు

exams
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 6.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 
 
జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో వ్యవహించి ఈ పరీక్షలను సజావుగా నిర్వహించారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ సలమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. 
 
కాగా, పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తర్వాత టెన్త్ ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.