శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (19:00 IST)

కారుతో సహా కొండపై నుంచి దూకి కరస్పాండెంట్ దుర్మరణం

Car
Car
కారుతో సహా కొండపై నుంచి దూకి కాలేజీ కరస్పాండెంట్ దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దేవరకొండలో విషాద ఘటన జరిగింది. 
 
దేవరకొండపై ఉన్న శ్రీ కొండమీద రాయుడి దేవాలయం దర్శనం అనంతరం తన స్విఫ్ట్ డిజైర్ కారులో తిరిగి కిందికి వస్తుండగా కొండపై నుంచి కారుతో సహా దూకేసి ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
అనంతపురం వేణుగోపాల్‌నగర్‌లోని శ్రీ విద్యానికేతన్ కరస్పాండెంట్ ఉమాపతి డ్రైవర్‌ను దింపేసి.. కొండపై నుంచి కారును కిందకు డ్రైవ్ చేశాడు. కారు కొండపై నుంచి బోల్తా కొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఉమాపతి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కారు నుంచి డ్రైవర్‌ను దించేసి కొండపై నుంచి కారును నడుపుకుంటూ వెళ్లి.. ఉమాపతి కారును నడుపుకుంటూ వెళ్లి దుర్మరణం పాలయ్యాడు.