శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (16:23 IST)

గూగుల్ మెల్ల మెల్లగా ఆ పని చేస్తుందట.. ఉద్యోగులకు కష్టమే

గూగుల్ సంస్థ ఇప్పటికే 12వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన నేపథ్యంలో ఇంకా తమ ఉద్యోగులకు సంబంధించి మరిన్ని ప్రయోజనాలను దూరం చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. గూగుల్ సంస్థ ఉద్యోగులకు ఎంతో అనువైన వాతావరణం, అన్ని సౌకర్యాలు ఉండే కంపెనీగా పేరు పొందింది. 
 
కానీ ఇకపై అలాంటివి తగ్గుతూ వస్తున్నాయి. గూగుల్ కిచెన్స్, లాండ్రీ వంటి సేవలు ఇక ఉద్యోగులకు అంతంత మాత్రమే. ముఖ్యంగా అక్కడ ఉద్యోగులకు ఆహారం అత్యున్నత ప్రమాణాలతో కూడి ఉంటుంది. 
 
గూగుల్ క్లౌడ్ కిచెన్స్‌ ద్వారా వీటిని వడ్డిస్తారు. ఇక వీటిని కూడా క్రమక్రమంగా ఉద్యోగులకు దూరం చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక ఉద్యోగి చెప్పాడు. ఇక గూగుల్‌లో ఉద్యోగులకు ఇచ్చే గిఫ్ట్స్, పార్టీలు వంటివి కూడా దూరమైనట్లు సమాచారం.